Home > సినిమా > LEO Movie Trailer Telugu : లియో ట్రైలర్ ఎలా ఉంది..?

LEO Movie Trailer Telugu : లియో ట్రైలర్ ఎలా ఉంది..?

LEO Movie Trailer Telugu  : లియో ట్రైలర్ ఎలా ఉంది..?
X

ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ లియో. తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కాబోతోంది. త్రిష ఫీమేల్ లీడ్ లో సంజయ్ దత్, అర్జున్ సర్జా విలన్స్ గా నటిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ లోకేష్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ తమిళ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇతర భాషల్లో హిట్ మాత్రమే అనిపించుకుంది. బట్ లోకేష్ లాస్ట్ మూవీ విక్రమ్ దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. పైగా ఈ మూవీ విక్రమ్ కు కొనసాగింపుగా లోకేష్ సినీవర్స్ ను కంటిన్యూ చేసేలా ఉంటుందనే టాక్ ఉండటంతో దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ లియో కోసం ఎదురుచూస్తున్నారు. ఇక లేటెస్ట్ ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.

విక్రమ్ తర్వాత లోకేష్ డైరెక్ట్ చేసిన సినిమా కాబట్టి మళ్లీ అలాగే ఉంటుందనుకున్నారు. బట్ లోకేష్ ట్విస్ట్ ఇచ్చాడు. పూర్తిగా ఓ కొత్త కథను చెప్పే ప్రయత్నం చేసినట్టుగా ఉంది. అఫ్ కోర్స్ చివర్లో మళ్లీ విక్రమ్ లా ట్విస్ట్ ఇచ్చాడు. ట్రైలర్ చూస్తే ‘ఎవరో ఒక లంజా కొడుకు నాలా ఉన్నాడని ప్రతి ఒక్కడూ నా ప్రాణం తీస్తే నన్నేం చేయమంటావే..’అనే డైలాగ్ ను బట్టిఇందులో విజయ్ డ్యూయొల్ రోల్ చేశాడని అర్థం అవుతుంది. ఒక విజయ్ లా ఉండే వ్యక్తిని వెదుకుతూ మరో విజయ్ ని వెంటాడుతుంటాడు విలన్. వారి బారి నుంచి తప్పించుకుంటూ పారిపోతూ పారిపోతూ ఉన్న విజయ్.. ఒక దశలో ఎదురు తిరుగుతాడు. తన కుటుంబాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నవారిని అంతం చేయాలని తిరుగుబాటు మొదలుపెడతాడు. మరి అసలు విజయ్ ఎవరు..? ఈ విజయ్ ఎవరు.. ఆ విలన్స్ వీరి వెంట ఎందుకు పడుతున్నారు అనేది లోకేష్ తనదైన శైలిలో రివీల్ చేస్తాడు.. అనేది అందరికీ తెలిసిందే. బట్ ఈ ట్రైలర్ లో అతని టేకింగ్, మేకింగ్ మెస్మరైజ్ చేస్తున్నాయి. ఒక్కో షాట్ ఒక్కో రేంజ్ లో ఉందనే చెప్పాలి. ఎప్పట్లానే తన సినిమాల్లో కనిపించే బ్లడ్ షెడ్ కనిపిస్తోంది. యాక్షన్, గన్స్, బ్లాస్ట్స్, ఊచకోత అన్నీ కామన్ గానే కనిపిస్తున్నాయి.




ట్రైలర్ లో విజయ్, విలన్స్ తో పాటు త్రిష కాకుండా ఇతర ప్రధాన పాత్రలు తక్కువగానే ఉన్నాయి. ఆర్ఆర్ అంతగా ఆకట్టుకోలేదు కానీ.. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉండబోతోందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ ట్రైలర్ ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ అయిందా అంటే చెప్పడం కష్టమే అనాలి. అలాగని బాలేదు అనలేం. లేదూ ఇలాంటి ట్రైలర్ తో ఎక్స్ పెక్టేషన్స్ ను లో ప్రొఫైల్ లో ఉండేలా లోకేష్ నిర్ణయించుకున్నాడో కూడా తెలియదు. బట్ లియో పై ఇప్పటి వరకూ ఉన్న హైప్ ను ఈ ట్రైలర్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ చేసింది అని మాత్రం చెప్పలేం.

Updated : 5 Oct 2023 6:56 PM IST
Tags:    
Next Story
Share it
Top