Home > సినిమా > ఇండస్ట్రీలోకి మరో స్టార్ వారసుడు

ఇండస్ట్రీలోకి మరో స్టార్ వారసుడు

ఇండస్ట్రీలోకి మరో స్టార్ వారసుడు
X

ఏ ఇండస్ట్రీలో చూసినా ఇప్పుడు వారసులదే హవా. అన్ని పరిశ్రమల్లోనూ వారసులే హల్చల్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ టాలెంట్ తో పాటు సక్సెస్ రేట్ కూడా ఉన్నవాళ్లే సర్వైవ్ అవుతారు. కాకపోతే కొన్నాళ్ల పాటు రుద్దబడతారు. విశేషం ఏంటంటే.. ఒకప్పుడు నెపోటిజంను విమర్శించి తర్వాత పైకొచ్చిన వాళ్లు కూడా మళ్లీ తమ వారసులను ఇండస్ట్రీలోకే తెస్తుంటారు. అవన్నీ ఎలా ఉన్నా.. కోలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ నుంచి చిన్న హీరోగా మారి విలన్ గా మెప్పించి.. ఇండియా మొత్తం ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అనిపించుకున్న విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి కూడా హీరోగా మారబోతున్నాడు. అతని డెబ్యూ మూవీకి స్టంట్ మాస్టర్ డైరెక్టర్ గా మారుతుండటం విశేషం.

సూర్య సేతుపతి ఇప్పటి వరకూ కొన్ని సినిమాల్లో నటించాడు. కాకపోతే హీరోగా కాదు. తండ్రితోనూ ఓ సినిమాలో కలిసి నటించడం విశేషం. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు. స్వయంకృషితో ఎదిగిన విజయ్ సేతుపతి తన కొడుకును మరీ ఎక్కువగా ప్రమోట్ చేయడం లేదు. అందుకు సింపుల్ గానే అతని లాంచింగ్ ఉంటుందని చెబుతున్నారు. బట్ ఇండస్ట్రీ పెద్దలు సపోర్ట్ గా వీడియో బైట్స్ విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇక ఈ చిత్రంతో ఫైట్ మాస్టర్ అనల్ అరసు దర్శకుడుగా మారుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు రానున్నాయి. మొత్తంగా కోలీవుడ్ నుంచి మరో వారసుడు హీరోగా మారబోతున్నాడు.

Updated : 24 Nov 2023 6:31 PM IST
Tags:    
Next Story
Share it
Top