Home > సినిమా > Vijay Sethupathi : మళ్లీ మళ్లీ అదే ప్రశ్న.. ఫైర్ అయిన విజయ్ సేతుపతి

Vijay Sethupathi : మళ్లీ మళ్లీ అదే ప్రశ్న.. ఫైర్ అయిన విజయ్ సేతుపతి

Vijay Sethupathi : మళ్లీ మళ్లీ అదే ప్రశ్న.. ఫైర్ అయిన విజయ్ సేతుపతి
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ సేతుపతి వెర్సటైల్ రోల్స్ లో నటించి అందరినీ మెప్పించాడు. విలన్, హీరో.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోతాడు. ఎంతో కూల్ గా ఉండే విజయ్ సేతుపతి.. సహనం కోల్పోయాడు. తన సినిమా ప్రెస్ మీట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై మండిపడ్డాడు. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతారా? అంటూ సీరియస్ అయ్యాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ జంటగా నటించిన సినిమా మెర్రీ క్రిస్మస్. శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.

అందులో ఓ రిపోర్టర్.. ‘గత 75 ఏళ్లుగా తమిళ, హిందీ వార్ నడుస్తుంది. తమిళ రాజకీయ నాయకులు హిందీ వ్యతిరేకంగా ఉన్నారు. చాలామంది తమకు హిందీ రాదనే టీ షర్టులు వేసుకుని నిరసన తెలుపుతుంటారు. దానిపై మీ స్పందన ఏంటి?’ అని విజయ్ ని ప్రశ్నించాడు. దానికి సహనం కోల్పోయిన విజయ్.. ‘భాషగా హిందీని ఎవరూ వ్యతిరేకించడం లేద’ని చెప్పారు. ఆ వెంటనే మైక్ అందుకున్న రిపోర్టర్.. ‘హిందీ నేర్చుకుంటే తప్పేంట’ని అడిగాడు. దానిపై మరోసారి ఫైర్ అయిన విజయ్.. ‘అదే ప్రశ్న అమీర్ ఖాన్ ను అడిగారు. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు. ఇలా ఇంకా ఎంతమందిని అడుగుతారు. హిందీ భాషకు మేం వ్యతిరేకులం కాదు. ఆ భాషను తప్పనిసరి చేయడంపైనే వ్యతిరేకులం. రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ విషయమై మంత్రి త్యాగరాజన్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో ఒకసారి చూడండ’ని వివరించాడు.




Updated : 8 Jan 2024 4:02 PM IST
Tags:    
Next Story
Share it
Top