Home > సినిమా > తమన్నాతో డేటింగ్ నిజమే, పిచ్చిపిచ్చిగా ఉంది.. ప్రకటించిన విజయ్

తమన్నాతో డేటింగ్ నిజమే, పిచ్చిపిచ్చిగా ఉంది.. ప్రకటించిన విజయ్

తమన్నాతో డేటింగ్ నిజమే, పిచ్చిపిచ్చిగా ఉంది.. ప్రకటించిన విజయ్
X

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ప్రేమలో పడిందని చాన్నాళ్లుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఆమెతో డేటింగ్ చేస్తున్నానని నటుడు విజయ్ వర్మ బహాటంగా ప్రకటించాడు. తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని, తమన్నాను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీంతో, తమ మధ్య లవ్వు గివ్వు లేదని, మాంచి ఫ్రెండ్ మాత్రమేనని తమన్నా చెప్పిన కబుర్లన్నీ తేలిపోయాయి. విజయ్ గురించి ఇప్పటికే చాలాసార్లు భావోద్వేగంతో చెప్పి ‘పచ్చబొట్టు’ భామకు అభిమానులు ప్రేమశుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే గోవాతోపాటు పలు ఫారిన్ టూరిస్ట్ స్పాట్లకు చెక్కేసి వచ్చిన ఈ జంట విడిపోకుండా, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కాలని కోరుతున్నారు.

తమన్నా, విజయ్ వర్మ ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’లో కలిసి నటించడంతో బాగా దగ్గరయ్యారు. ‘మేమిద్దరం డేటింగ్‌ చేస్తున్నామని నాకిప్పుడు బాగా తెలిసొచ్చింది. ఆమె సాహచర్యంలో చాలా ఆనందంగా ఉంది. ఆమెను వెర్రిగా ప్రేమిస్తున్నా. ఆమె రాకతో నా జీవితంలో విలన్‌ అధ్యాయం ముగిసి, ప్రయణకాండ మొదలైసంది’’ అని జీక్యూ అనే వినోద పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు విజయ్. మార్వారీ కుటుంబలో జన్మించిన 37 ఏళ్ల విజయ్ వర్మ హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. పలు హిందీ చిత్రాలతోపాటు నాని, ‘ఎంసీఏ’ చిత్రంలోనూ నటించాడు. ముంబైలో జన్మించిన 33 ఏళ్ల తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. చిన్నవయసులో సినిమాల్లోకి వచ్చిన తమన్నా బిగ్ హీరోలతో జట్టుకట్టి దక్షిణాదిని దున్నేసి ఉత్తరాదిలో అదృష్టం పరీక్షించుకుంటోంది. వెబ్ సిరీస్‌లలో బోల్డ్‌గా దుమ్మురేపుతోంది. విజయ్ వర్మ ప్రేమబాగోతాన్ని బయటపెట్టడంతో త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కే అవకాశం ఉంది.

Updated : 14 July 2023 10:18 PM IST
Tags:    
Next Story
Share it
Top