విజయ్ కి అలాంటి భార్య కావాలి
X
ఒకప్పుడు అసలు పెళ్ళే వద్దనుకున్నాడు. సోలో లైఫే సో బెటరూ అనుకున్నాడు. కానీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు చేసుకుని హాయిగా ఉండడం చూశాడు. తనకూ ఆ లైఫ్ కావాలనుకున్నాడు. ఇది మరెవరో కాదు అండి మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ విషయం అతనే స్వయంగా చెప్పాడు. మరో రెండు, మూడేళ్ళల్లో పెళ్ళి చేసుకుని సెటిల్ అయిపోతానని చెబుతున్నాడు. అయితే విజయ్ కు ఎలాంటి అమ్మాయి కావాలో అతనైతే చెప్పలేదు కానీ ఆ వివరాలను సమంత చెబుతోంది.
విజయ్-సమంత కలిసి ఖుషి చేశారు. సెప్టెంబర్ 1 న విడుదల అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో వీళ్ళిద్దరూ ఇప్పుడు బిజీగా ఉన్నారు. మూడు రోజుల క్రితం మ్యూజికల్ కన్సర్ట్ అయింది. అందులో విజయ్-సమంత డాన్స్ తో అదరగొట్టారు. ఇందులో భాగంగానే విజయ్ కు ఎలాంటి అమ్మాయి కావాలో రివీల్ చేసింది సమంత. అతన్ని పెళ్ళి చేసుకునే అమ్మాయికి ఈ లక్షణాలు తప్పనిసరి అని చెబుతోంది.
విజయ్ కి కాబోయే భార్య చాలా సింపుల్ గా ఉండాలిట. అతని కుటుంబంతో సులువుగా కలిసిపోవాలి. ఎందుకంటే విజయ్ కు అతని తల్లిదండ్రులు, కుటుంబం అంటే ఎంతో ఇష్టం, గౌరవం అని చెప్పకొచ్చింది సామ్. విజయ్ చాలా సాధారణంగా ఉంటాడు. దానికి తగ్గట్టే అమ్మాయి కూడా ఉంటే బావుంటుందని అంటోంది సమంత. దీంతో పాటూ విజయ్ ఫోన్ కాల్ కంటే మెసేజీలే ఎక్కువగా చేస్తాడు. గేమింగ్ యాప్స్ ఎక్కువగా వాడతాడు. అతడికి ఫ్రెండ్స్ ఎక్కువ అని కూడా చెప్పింది.మరి సామ్ చెప్పిన లక్షణాలు అన్నీ రష్మికలో ఉన్నాయా లేదా అని చర్చించుకుంటున్నారు సినీ ప్రియులు, నెటిజన్లు. విజయ్-రష్మిక లవ్ లో ఉన్నరని ఎప్పటి నుంచో రూమర్స్ నడుస్తున్నాయి.
మరోవైపు నా గురించి ఇంత చెప్పింది కదా నేను కూడా తన గురించి చెబుతా అంటున్నాడు విజయ్ దేవరకొండ. సమంత చాలా పద్ధతిగా, సహనంగా ఉంటుందని చెబుతున్నాడు. ఆమెకు ఎంత కోపం వచ్చినా అసభ్యంగా మాట్లాడదు అంటున్నాడు. రాహుల్ రవీంద్రన్, చిన్మయి, నీరజ కోన, మేఘన సమంత బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ సినిమాలోనే కాకుండా బయటకూడా తమ మధ్య మంచి కెమిస్ట్రీ ఉందని చూపిస్తున్నారు విజయ్-సామ్ లు. ఖుషి సినిమా ప్రమోషన్ ను ఇలా సాగిస్తున్నారు.