Home > సినిమా > Khushi movie collections: విజయ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్!

Khushi movie collections: విజయ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్!

Khushi movie collections: విజయ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్!
X

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ఖుషి. యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. ప్రస్తుతం థియేటర్లలో అందరినీ ఖుషీ చేస్తోంది. సెప్టెంబర్ 1న విడులైన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, మురళీశర్మ, జయరాం కీ రోల్స్ పోషించారు. ఈ సినిమాకు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం అందించారు. 22 ఏళ్ల కిందట వచ్చిన పవన్ కల్యాణ్ ‘ఖుషి’ పేరుతో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖుషి.. అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతుంది. అంతేకాకుండా ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబడతుందని సినీ వర్గాలు చెప్తున్నాయి.





వరల్డ్ వైడ్ గా 30 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొదట ఈ సినిమాకు 23 నుంచి 25 కోట్ల మధ్య వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ, ఓల్డ్ స్టోరీ అనిపించినా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లకు పైగా షేర్ అందుకోగా.. వరల్డ్ వైడ్ గా రూ.16 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఇక గ్రాస్ వైజ్ చూసుకుంటే ఏకంగా రూ.30 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. కొందరు విమర్శకులు సినిమా యావరేజ్, కథ, స్క్రీన్ ప్లే ఊహించినట్లు ఉన్నాయని అంటున్నారు. కాన్ ఫ్లిక్ట్ పాయింట్ కంటే రొమాంటిక్ ట్రాక్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుందని చెప్తున్నారు. మరికొందరు సినిమా బాగుందంటూ పాజిటివ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈవారం గడిస్తే కానీ సినిమా మూవీ ఏ రేంజ్ లో నిలబడుతుందనేది ఏం చెప్పలేమని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే 8 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. మరికొద్ది గంటల్లో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరే అవకాశం ఉంది.






Updated : 2 Sept 2023 5:56 PM IST
Tags:    
Next Story
Share it
Top