Home > సినిమా > మహాభారతం వచ్చేది అప్పుడే-విజయేంద్రప్రసాద్

మహాభారతం వచ్చేది అప్పుడే-విజయేంద్రప్రసాద్

మహాభారతం వచ్చేది అప్పుడే-విజయేంద్రప్రసాద్
X

రాజమౌళి కలల ప్రాజెక్ట్ మహాభారతం మీద ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాజమౌళి, మహేష్ బాబుతో తీసే సినిమా గురించి, ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

మహాభారతాన్ని సినిమాగా తీయాలన్నది తన డ్రీమ్ అని రాజమౌళి చాలా సార్లు చెప్పారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను భారీగా తీయాలనుకుంటున్నానని....భారతీయ కథలని ప్రపంచానికి చెప్పాలని జక్కన చాలాసార్లు చెప్పారు. భారతాన్ని తీయాల్సి వస్తే పది భాగాలుగా తీయాల్సి ఉంటుదని కూడా అన్నారు. ఇప్పుడు దీని గురించి రాజమౌళి నాన్న, కథారచయిత విజయేంద్రప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు సినిమా అయిన వెంటనే మహాభారతం సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నామని ఆయన చెప్పారు.

ఇక మహేష్ బాబు సినిమా...ఓ అడ్వెంచరస్ మూవీ అని చెప్పారు విజయేంద్రప్రసాద్. దీన్ని భారీ స్థాయిలో తీయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అన్నింటికంటే ఇంట్రస్టింగ్ న్యూస్ మరొకటి కూడా చెప్పారు ఈయన. అదే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి. ఈ సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు విజయేంద్రప్రసాద్ తెలిపారు. రామ్ చరణ్, ఎన్టీయార్ లను రెడీ చేస్తున్నట్టు కూడా తెలిపారు. అయితే దీనికి రాజమౌళి దర్శకత్వం వహిస్తారా? లేకపోతే హాలీవుడ్ డైరెక్టర్ ఎవరైనా చేస్తారా అనేది ఇప్పుడు చెప్పలేమని అన్నారు. కాకపోతే రాజమౌళి పర్యవేక్షణలోనే ఉంటుందని స్పష్టం చేశారు.

Updated : 10 July 2023 2:40 PM IST
Tags:    
Next Story
Share it
Top