ఈసారి థ్రిల్ మామూలుగా ఉండదు..విరూపాక్ష-2 క్రేజీ అప్డేట్
X
విరూపాక్ష..ఈ సినిమా ఎంతటి భారీ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్‌తో వెండితెరమీద విడుదలైన ఈ చిత్రం వసూళ్ల సునామీని సాధించింది. మెగావారి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రెండేళ్ల గ్యాప్ తరువాత విరూపాక్ష సినిమాతో తెరముందు కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ తన పెర్ఫార్మెన్స్తో అందరినీ వీర లెవెల్లో భయపెట్టేసింది. ఊహించని ట్విస్టులు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో విరూపాక్ష మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు తనదైన మార్క్‌ను ఈ సినిమా ద్వారా చూపించాడు.
విరూపాక్ష సూపర్ డూపర్ హిట్‌తో ప్రేక్షకులు విరూపాక్ష పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ కార్తీక్ దండు కూడా రెట్టింపు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తీసుకురావాలని తెగ కసరత్తు చేస్తున్నాడు. కథ సిద్ధం కావడంతో ప్రస్తుతం మూవీ టీమ్ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. ఈ క్రమంలో చిత్ర బృందం
విరూపాక్ష 2 షూటింగ్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుందని ప్రకటించింది. ఈ మేరకు ఈసారి థ్రిల్ మూమూలుగా ఉండదంటూ మూవీ పోస్టర్ ఒకటి విడుదల చేసింది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.