Home > సినిమా > విరూపాక్ష డైరెక్టర్‎కి ఖరీదైన గిఫ్ట్..ఎలాంటి కారో తెలుసా?

విరూపాక్ష డైరెక్టర్‎కి ఖరీదైన గిఫ్ట్..ఎలాంటి కారో తెలుసా?

విరూపాక్ష డైరెక్టర్‎కి  ఖరీదైన గిఫ్ట్..ఎలాంటి కారో తెలుసా?
X

విరూపాక్షతో ఊహించని హిట్‎ను తన ఖాతాలో వేసుకున్నాడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఓటీటీలోనూ సూపర్ హిట్ అయింది, కొత్త డైరెక్టర్ అయినా ప్రేక్షకులను భయపెట్టి మరీ వారికి బాగా దగ్గరయ్యాడు కర్తీక్. డిఫరెంట్ కాన్సెప్ట్‎తో , స్క్రీన్‎ప్లే‎తో ఇరగదీశాడు. స్క్రీన్ ప్లే విషయంలో గురువు గారు స్టార్ డైరెక్టర్ సుకుమార్ హెల్ప్ చేసినప్పటికీ ఓవరాల్ క్రెడిట్ మాత్రం కార్తీక్‎దే. అందుకే మూవీ టీమమ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి కార్తీక్ ను ఖుష్ చేసింది.విరూపాక్ష నిర్మాతలు కార్తీక్ కి ఖరీదైన బెంజ్ కారు సీ క్లాస్ మోడల్‎ను బహుమతిగా అందించారు. అందుకు సంబంధించిన పిక్స్‎ను కార్తీక్ తన ట్విటర్‏లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


మన దేశంలో బెంజ్ సీ క్లాస్ మోడల్‎ కారు ధర రూ. 65 నుంచి 70 లక్షల వరకు ఉంటుంది. ఇలా హిట్ ఇచ‍్చిన డైరెక్టర్‎కు ప్రొడ్యూజర్లు కారుని బహుమతిగా ఇవ్వడం గతంలోనూ చాలాసార్లే జరిగింది. ఇప్పుడు 'విరూపాక్ష' దర్శకుడి విషయంలో మరోసారి నిర్మాతలు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి సర్‎ప్రైజ్ చేశారు. తన హిట్‏కు కారకులైన గురువు సుకుమార్ కి, హీరో సాయిధరమ్ తేజ్ తో పాటు నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ -డివిఎల్ ఎన్ ఎస్ గారికి కార్తీక్ కృతజ్ఞతలు తెలియజేసాడు.







Updated : 28 Jun 2023 7:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top