స్టేజ్పై రొమాన్స్ చేసిన హీరో, హీరోయిన్.. వీడియో వైరల్
X
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.’ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం (ఆగస్టు 16) ‘సుట్టంలా సూసి పోకల’ అంటూ సాగే పాటను చిత్ర బృందం లాంచ్ చేసింది. ఈ పాటకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో విశ్వక్, నేహాశెట్టిల డ్యాన్స్.. యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు.
కాగా, ఇవాళ నిర్వహించిన సాంగ్ రిలీజ్ ఈవెంట్లో హీరో, హీరోయిన్ రెచ్చిపోయారు. ఆ పాటకు స్టేజ్ పైనే రొమాంటిక్ గా డ్యాన్స్ చేశారు. నేహా తన చీరను విశ్వక్ సేన్ కు కప్పుతూ.. అతను ఆమెను హత్తుకుంటూ డ్యాన్స్ ఇరగదీశారు. దీంతో ప్రేక్షకులంతా కేకలు పెడుతూ.. వాళ్ల డ్యాన్స్ ను ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.