తన గురించి త్వరలో చెప్తానంటూ.. పెళ్లిపై పోస్ట్
X
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడా..? అంటే అవుననే సమదానం వినిపిస్తోంది. తన బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పి పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా విశ్వక్ చేసిన పోస్ట్ వల్లే ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ అందులో ఏముందంటే.. ‘నా ఫ్యాన్స్, శ్రేయోభిలాషులకు థాంక్యూ. మీరు ఇన్నాళ్లుగా నాపై కురిపించిన ప్రేమ, నాకిచ్చిన మద్దతుకు రుణపడుంటా. నా జీవితంలో కొత్త అధ్యయనాన్ని మొదలుపెట్టబోతున్నా. కొత్త ఫ్యామిలీని ప్రారంభించబోతున్నా. త్వరలో దానికి సంబంధించిన వివరాలతో మీ ముందుకొస్తానం’టూ పోస్ట్ పెట్టాడు.
ఆ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ అగస్ట్ 15న చప్తానంటూ రాసుకొచ్చాడు. దీంతో ఇది కచ్చితంగా విశ్వక్ పెళ్లి వార్తేనని అభిమానులు చెప్పుకుంటున్నారు. అయిే, నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాడా? లేదా ఏదైనా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పెట్టిన పోస్టా? అనే చర్చ నడుస్తోంది. ఇక విశ్వక్ తీస్తున్న సినిమాల విషయానికొస్తే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రాబోతోంది. కృష్ణచైతన్య డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషిస్తోంది.