Home > సినిమా > ‘నా కెరీర్లో గామీనే చివరిది’.. విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘నా కెరీర్లో గామీనే చివరిది’.. విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘నా కెరీర్లో గామీనే చివరిది’.. విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, విశ్వధర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా గామి. ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినూత్న కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత నుంచి ఆ అంచనాలు మరింత పెరిగాయి. మేకర్స్ కూడా.. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప అనుభూతినిస్తుందని ముందు నుంచి చెప్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అదే ఫీలింగ్ లో ఉన్నారు. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విశ్వర్ సేన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో గామి సినిమా గురించి, తన తదుపరి సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘ఆరేళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నాం. కథ, కథనం, విజువల్స్, గ్రాఫిక్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్ కి ఒక సరికొత్త అనుభూతినిస్తుంది. ఇలాంటి సినిమా రావడం చాలా అరుదు. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. అందుకే నా కెరీర్ లో చేస్తున్న చివరి ప్రయోగాత్మక సినిమా కూడా ఇదే. అంతేకాదు ఇకపై నేను చేసే సినిమాలన్నీ వేరే లెవల్లో ఉంటాయి. ఫ్యాన్స్ నా నుండి ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అవే తీస్తా. ఆడియన్స్ కు మెంటలెక్కిపోవాల’ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

https://www.youtube.com/watch?v=ypVZ7X_xRiE

Updated : 3 March 2024 3:46 PM GMT
Tags:    
author-thhumb

Krishna

సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.


Next Story
Share it
Top