Vishwambhara : విశ్వంభర క్రేజీ అప్డేట్.. చిరుకు జోడీ ఎవరో తెలుసా?
X
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Vishwambhara)కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట(Vassishta) తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ వీడియో ఆ అంచనాలను మరింత పెంచేసింది. అందులోనూ ఈ మూవీ బాసూ చిత్రం కావడంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
అయితే, మెగాస్టార్ నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. బాసూతో జత కట్టేది ఎవరా అని ఫ్యాన్స్ కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలా అనుష్క, మృణాల్ ఠాకూర్, త్రిష, హనీ రోజే పేర్లు ఇలా చాలానే వినిపించాయి. తాజాగా ఇదే విషయంపై క్లారీటి ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఫిక్స్ చేశామంటూ ఆమెకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతో కొంతకాలంగా విశ్వంభర హీరోయిన్ గురించి వస్తున్న న్యూస్ కు బ్రేక్ పడింది.
అయితే గతంలో చిరంజీవి, త్రిష(trisha) కాంబోలో ఇప్పటికే స్టాలిన్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్(murugadas) తెరకెక్కించిన ఈ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ 2006లో విడుదలైంది. మూవీకి యావరేజ్ హిట్ గా టాక్ వచ్చినప్పటికీ వీరి జంటకు మంచి పేరే వచ్చింది. దాదాపు 18 సంవత్సరాల తరువాత చిరుతో స్క్రీన్ షేర్ చేసుకొనుంది త్రిష. మరి రెండోసారి జతకట్టనున్న ఈ జంట ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తారో వేచి చూడాల్సిందే. ఇక విశ్వంభర మూవీలో చిరంజీవి సరికొత్త గెటప్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఆయన ఎన్ని గెటప్స్ లో కనిపిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ విశ్వంభర నిలవనుంది.