Vivek Agnihotri : బాలీవుడ్ హీరోపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన వివేక్ అగ్నిహోత్రి
X
బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్రిహోత్రి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఇండియా వైడ్‌గా పాపులారీటిని తెచ్చుకున్న ఈ దర్శకుడు ఈసారి రణ్ వీర్ సింగ్ మీద పడ్డాడు. రణ్ వీర్ ఓ అవార్డు కార్యక్రమంలో అందరి ముందు తన కాళ్లు పట్టుకున్నాడని చెప్పాడు. ఆ హీరో చేసిన న్యూడ్ ఫోటో షూట్ పై విమర్శలు వెల్లువెత్తిన సమయంలో తాను మాత్రం సమర్థించానని అన్నాడు. అందుకు కృతజ్ఞతగా రణ్ వీర్ సింగ్ తన పాదాలు తాకాడని వివేక్ అగ్నిహోత్రి చెప్పాడు. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు తాను ఎవరికీ చెప్పలేదని అన్నాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
కొన్నాళ్ల క్రితం రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేశారు. దీన్ని సాంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. రణ్ వీర్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆయనకు బట్టలు దానం చేయండంటూ ఓ క్యాంపెయిన్ చేశారు. పలు చోట్ల ఆయనపై కేసులు కూడా పెట్టారు.
వివాదాస్పద వ్యాఖ్యలతో వివేక్ అగ్నిహోత్రి నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ ను ఉద్దేశిస్తూ పరోక్షంగా అనుచిత కామెంట్స్ చేశారు. రాత్రంతా తాగి పొద్దున్నే దేవుడిని అంటే ఎవరూ నమ్మరు. జనాలు పిచ్చోళ్ళు కాదు అందరినీ దేవుడిగా అంగీకరించరు అన్నాడు. దీనిపై పెద్ద దుమారమే రేగింది.