‘ఆదిపురుష్.. రాత్రి మందుకొట్టి పొద్దున దేవుణ్ని అంటే నమ్మరు’’..
X
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరామచంద్రుడిగా, కృతి సనన్ సీతాదేవిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జనాన్ని ఆకట్టుకోకపోయినా విమర్శకులకు మాత్రం బాగానే పనిచెప్తోంది. ప్రభాస్‌పై ఇప్పటికే విమర్శలు సంధించిన బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సబ్జెక్ట్‌పై స్టడీ చేయకుండా ఇలాంటి సినిమాలు తీసేవారు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారని, అందుకే బోల్తా పడుతున్నాయని అన్నారు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన వివేక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆదిపురుష్ టీమ్‌ను ఆడుకున్నారు.
‘‘చూపే విషయం మీద వందశాతం పట్టు ఉండాలి. ప్రేక్షకులు మూర్ఖులు కారు. తేడా కొడితే తిరగ్గొడతారు. రామాయణం, మహాభారతం, భగవద్గీతలు ప్రజల్లో నాటుకుపోయాయి. వాటిపై సినిమా తీస్తున్నప్పుడు బాగా అధ్యయనం చేయాలి. కానీ ఇప్పుడు ఎవరు పడితే వారు తెరమీద కనపడి నేను దేవుడిని అని అంటున్నారు. రాత్రి మందుకొట్టి ఇంటికి వెళ్లి పొద్దున్నే నేను దేవుణ్ని అంటే నమ్మే రోజులు పోయాయి’’ అని అన్నారు. వివేక్ అగ్నిహోత్రి ఇటీవల విడుదలై ప్రభాస్‘ సలార్’ మూవీ గ్లింప్స్‌పైనా ఘాటుగా స్పందించారు. ‘‘హింసను గ్లమరైజ్ చేయడం కూడా ప్రతిభగా భావిస్తున్నారు’’ అ ని మండిపడ్డారు. సినిమాల్లో మితిమీరిన హింసని చూపడం, వాటిని ప్రోత్సహించడం అసలు నటులే కాని వాళ్లను బిగ్గెస్ట్ స్టార్స్ అని చెప్పుకోవడం పెద్ద టాలెంట్ అనుకుంటున్నారని ప్రభాస్‌ను టార్గెట్ చేశారు. తాజా వ్యాఖ్యలు ఎవర్ని టార్గెట్ చేసుకుని అన్నవో స్పష్టం కావడం లేదు.