Home > సినిమా > తెలుగు ఇండియన్ ఐడల్-2 విన్నర్ సౌజన్య..ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

తెలుగు ఇండియన్ ఐడల్-2 విన్నర్ సౌజన్య..ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

తెలుగు ఇండియన్ ఐడల్-2 విన్నర్ సౌజన్య..ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
X

ఎంట‌ర్‌టైన్మెంట్‌ విషయంలో తగ్గేదేలేదంటూ వినూత్న కార్యక్రమాలతో దూసుకెళ్తోంది ఆహా. ఈ ఓటీటీ ద్వారా వచ్చిన చాలా వరకు ప్రోగ్రామ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలా నాన్ స్టాప్ గా విజయవంతంగా ముందుకెళ్తోన్న షోలలో 'తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్' ఒకటి. మొదటి సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో అదే జోష్‎లో రెండవ సీజన్‎ను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసింది ఆహా. ఈ తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2 ఫినాలే ఎపిసోడ్‎కు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్టుగా వచ్చి రచ్చ రచ్చ చేశారు. బన్నీ ఎంట్రీతో ఫైనల్ ఎపిసోడ్ ఎంతో ఫన్నీగా సాగింది. ఎంతో ఉత్కంఠ‌త‌తో పోటా పోటీగా సాగిన ఫైన‌ల్‌లో విశాఖ అమ్మాయి సౌజ‌న్య భాగ‌వ‌తుల విన్నర్‎గా నిలిచింది. అల్లు అర్జున్ చేతుల మీదుగా సైజన్య ట్రోఫీ అందుకుంది.


తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2 ఫినాలేకి గెస్టుగా రావడ చాలా సంతోషంగా, థ్రిల్లింగ్‌గా ఉందని బన్నీ అన్నారు. ఈ షో మ‌ర‌చిపోలేని జ్ఞాప‌కంగా మిగిలిపోతుందన్నారు. విన్నర్ సౌజ‌న్య‌కు ట్రోపీ అందించిన బన్నీ ఆమెకు అభినంద‌న‌లు తెలిపారు. రెండేళ్ల పాపకు తల్లైనా కూడా సౌజన్య ఎంతో అంకిత భావంతో సింగింగ్ కాంపిటీషన్‎లో పాల్గొందని, అయితే అది అంత తేలికైన అల్లు అర్జున్ అన్నారు. ఓ వైపు ఫ్యామిలీని, మరోవైపు మ్యూజిక్‎ను బ్యాలెన్స్ చేస్తూ ఎంతో డెడికేషన్‎తో పాడిన పాటలే ఆమెను విజేతగా నిలబెట్టాయన్నారు. ఇది చూస్తుంటే సౌజన్య పట్ల నాకు ఎంతో గౌర‌వం పెరిగిందని తెలిపారు. ఈ సక్సెస్ అంద‌రికీ ఎంతో ఇన్స్పిరేషన్ అంటూ బన్నీ ఎమోషనల్ అయ్యారు .



సౌజన్య టైటిల్‎తో పాటు 10 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది. ఇక ఫస్ట్ రన్నరప్‎గా నిలిచిన జయరాజ్‎కు రూ.3 లక్షల చెక్‎ను అందించారు. సెకండ్ రన్నరప్‌గా నిలిచిన లాస్య రూ.2 లక్షల ప్రైజ్ మనీ అందుకుంది.





Updated : 5 Jun 2023 11:48 AM IST
Tags:    
Next Story
Share it
Top