Home > సినిమా > VV Vinayak : పాలిటిక్స్‌లోకి VV వినాయక్.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ?

VV Vinayak : పాలిటిక్స్‌లోకి VV వినాయక్.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ?

VV Vinayak  : పాలిటిక్స్‌లోకి VV వినాయక్.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ?
X

లోక్ సభ ఎలక్షన్స్ హడావిడి మొదలైంది. మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలుపొందాలని ప్రధాన పార్టీలన్నీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు లీడర్లు టికెట్ తమకే ఇస్తారని ప్రచారం చేస్తుండగా.. మరికొందరు అధిష్టానాల వద్ద పైరవీలు మొదలుపెట్టారు. ఇక ఏపీ రాజకీయాలు రంజుగా మారాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉండటంతో.. వైసీపీ ప్లాన్స్ రెడీ చేస్తుంది. పొత్తుగా వస్తున్న జనసేన, టీడీపీకి ధీటుగా.. వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేసే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో సినీ గ్లామర్ యాడ్ చేసే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తుంది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ను పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినీ గ్లామర్ తో పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు.. వినాయక్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో టికెట్ పక్కా చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆయనకు కాకినాడ లేదా ఏలూరు ఎంపీ టికెట్ కేటాయించే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసే వాళ్లు లేకపోలేదు. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన వినాయక్.. పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడో లేదో అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.




Updated : 5 Jan 2024 1:15 PM IST
Tags:    
Next Story
Share it
Top