Vyooham : మార్చి 2న వ్యూహం సినిమా విడుదల
X
ఏపీ సీఎం జగన్ రాజకీయ జీవితంపై రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం మూవీ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 23న విడుదల కావాల్సిన సినిమా టెక్నికల్ సమస్యతో చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడంతో మార్చి 2న విడుదల చేస్తామని ఆర్జీవి ట్వీట్ చేశారు. పట్టు వదలని విక్రమార్కున్ని అంటూ ఓ చేత్తో గన్ మరో చేత్తో సెన్సార్ సర్టిఫికెట్ పట్టుకున్న ఫోటోను వర్మ ట్వీట్ చేశారు.. వ్యూహం విడుదలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సినిమా విడుదలపై తుది తీర్పు ఇస్తామని హైకోర్టు గతంలో స్పష్టం చేసింది. అప్పటివరకు సినిమా విడులపై స్టే ఉంటుందని హైకోర్టు తెలిపింది. . ఈ సినిమాలో చంద్రబాబు , పవన్ కల్యాణ్‌లను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ లోకేశ్ కోర్టుకు వెళ్లారు. దీంతో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని సినిమా నిర్మాత హైకోర్టును కోరారు.