Home > సినిమా > ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపాలనే.. : ఆర్జీవీ

ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపాలనే.. : ఆర్జీవీ

ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపాలనే.. : ఆర్జీవీ
X

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పై రామ్ గోపాల్ వర్మ కన్నేశాడు. ఆ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై వరుసగా సినిమాలు తీస్తూ వార్తల్లోకెక్కుతున్నాడు. తాజాగా మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ పేర్లతో వివాదాస్పద సినిమాలు తీసి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు మరో వివాదాస్పద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కథ నేపథ్యంలో వ్యూహం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం బ్యారేజీపై జరుగుతోంది.





వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలపై వ్యూహం సినిమా తీస్తున్నాడు. కాగా, ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు ఆర్జీవీ. ‘నేను నమ్మిన నిజాన్ని వ్యూహం సినిమాలో చూపిస్తున్నా. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. వైఎస్ వివేకా హత్య ఘటన, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఈ సినిమాలో ఉంటాయి. పవన్ తప్ప మెగా ఫ్యామిలీలో ఎవరూ నన్ను కామెంట్ చేయలేదు. 2024 ఏపీ ఎన్నికలపై ప్రభావం చూపాలనే ఈ సినిమా తీస్తున్నాన’ని అన్నాడు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్జీవీ ఈ విషయాలు పంచుకున్నారు.




Updated : 13 Aug 2023 8:11 PM IST
Tags:    
Next Story
Share it
Top