Home > సినిమా > ఐకాన్ స్టారా మజాకా..దుబాయ్‌లో బన్నీ విగ్రహం

ఐకాన్ స్టారా మజాకా..దుబాయ్‌లో బన్నీ విగ్రహం

ఐకాన్ స్టారా మజాకా..దుబాయ్‌లో బన్నీ విగ్రహం
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు. మరింత జోష్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆగస్టు 15న పుష్ప2 రిలీజ్‌కు సిద్దమవుతోంది. ఈ మూవీతో మరిన్ని రికార్డులు కొల్లగొట్టేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు. పుష్ప మూవీలో యాక్టింగ్‌కు గాను రాష్ట్రపతి చేతుల మీదుగా తొలిసారి అవార్డు అందుకున్న హీరోగా బన్నీ రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు సౌత్ ఇండియా నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా ఐకాన్ స్టార్ రికార్డు సృష్టించాడు.

తాజాగా అల్లుఅర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయిన సెలబ్రిటీల విగ్రహాలను దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచుతారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మైనపు విగ్రహం కూడా ఆ మ్యూజియంలోకి చేరనుంది. ఇందుకోసం ఇప్పటికే బన్నీ కొలతలను కూడా తీసుకున్నారు.

మార్చి 28న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ విగ్రహం పుష్ప గెటప్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ మ్యూజియంలో ప్రభాస్, మహేష్ బాబు విగ్రహాలున్నాయి. ఇక ఇప్పుడు బన్నీ కూడా చేరనున్నాడు. ఈ విషయం తెలిసి పుష్పరాజ్ ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐకాన్ స్టారా మజాకా అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.



Updated : 22 March 2024 2:05 PM IST
Tags:    
Next Story
Share it
Top