Home > సినిమా > పెళ్లికి రెడీ అయిన నిత్యా మీనన్..వరుడు ఎవరో తెలుసా?

పెళ్లికి రెడీ అయిన నిత్యా మీనన్..వరుడు ఎవరో తెలుసా?

పెళ్లికి రెడీ అయిన నిత్యా మీనన్..వరుడు ఎవరో తెలుసా?
X

చైల్డ్ ఆర్టిస్ట్‎గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నటి నిత్యామీనన్‌. 2006లో వచ్చిన ఓ కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యింది. అలా మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో టాప్ హీరోల సరసన నటించి మల్టీ టాలెంటెడ్ నటిగా నిత్యామీనన్‌ మంచి క్రేజ్‎ను సంపాదించుకుంది. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాదు మంచి సింగర్‌గా కూడా తన స్పెషల్ టాలెంట్‎ను చాటుకుంది. అయితే ఇప్పుడు ఈ మలయాళీ కుట్టి కి చెప్పుకోదగ్గ సినిమా అవకాశాలు లేవు. దీతో ఇక పెళ్లి చేసుకోమని తన కుటుంబ సభ్యులు చెబుతున్నారట. ఈ క్రమంలో ప్రస్తుతం నిత్యా కొత్త ప్రాజెక్ట్‌లు ఏవీ సైన్ చేయకపోవడంతో నటి త్వరలో పెళ్లి చేసుకోబోతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో అమ్మడు పెళ్లి మ్యాటర్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.





నిత్యా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోను పెళ్లాడబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆ స్టార్ హీరో ఎవరు అన్నది మాత్రం సీక్రెట్‎గా ఉంచారు. ఆ స్టార్ హీరో నిత్యాకు చిన్ననాటి మిత్రుడని సమాచారం. అతడినే ప్రేమించి నిత్యా పెళ్లికి రెడీ అయ్యిందని రూమర్స్ తెగ హల్‎చల్ చేస్తున్నాయి. ఈ ప్రేమ పక్షులు ఆయా కుటుంబాలను ఒప్పించాయని, పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయని మాలీవుడ్‎లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తన పెళ్లిపై వచ్చిన ఈ ఊహాగానాలపై నటి ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే నిత్యా మీనన్ ప్రస్తుతం ఓ మలయాళం చిత్రంలో నటిస్తోందని తెలుస్తోంది.





నిత్యా మీనన్ తెలుగులో భీమ్లా నాయక్‌ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈ మలయాళీ ముద్దుగుమ్మ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న మోడరన్ లవ్ వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్ చేసింది. ‘ఆరం తిరుకల్పన’ తర్వాత నిత్యా కొత్త ప్రాజెక్ట్‌కి సైన్ చేయలేదు.




Updated : 24 Aug 2023 12:31 PM IST
Tags:    
Next Story
Share it
Top