ఆదిపురుష్ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..?
X
ప్రస్తుతం ఆదిపురుష్ హవా నడుస్తోంది. ఈ నెల 16న ఈ మూవీ రిలీజ్ కానుంది. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్తో వచ్చిన నెగిటివిటీని ట్రైలర్ తుడిచిపెట్టేసింది. ఇక ఇటీవల రిలీజైన సెకండ్ ట్రైలర్ కూడా ఎక్స్పెక్టేషన్స్ను మరింత పెంచింది. కాగా తాజా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చింది.
అయితే ఆదిపురుష్ రన్ టైం మాత్రం అనుకున్నదానికంటే కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ నిడివి 179 నిమిషాలు అని సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా తెలుస్తోంది. అంటే ఒక నిమిషం తక్కువ మూడు గంటల నిడివితో ఆదిపురుష్ థియేటర్లోకి రాబోతోంది. మొత్తంగా ఆదిపురుష్‌ని థియేటర్లో చూడాలంటే మూడున్నర గంటలకు పైగా సమయం కేటాయించాల్సిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ నడిచే ప్రతి థియేటర్లో హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించాలని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
ఇక ఈ మూవీకి సంబంధించి నిర్మాత అభిషేక్ అగర్వాల్ సంచలన ప్రకటన చేశారు. 10 వేల టికెట్స్ ఉచితంగా అందించబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, అనాధాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్స్ వారికి మాత్రమే ఈ టికెట్స్ ఫ్రీగా ఇవ్వనున్నారు. ‘‘శ్రీరాముని ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం. ఈ తరం పిల్లలు ఆయన గురించి తెలుసుకోవాలి. రాముడి అడుగుజాడలను అనుసరించాలి’’ అని అన్నారు.