రాకేష్ మాస్టర్ మృతికి కారణమేంటీ ?
X
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయనను బతికించేందుకు వైద్యలు చేసి విశ్వ ప్రయత్నాలు ఫలించలేదు. రాకేష్ మాస్టర్ మరణవార్త టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే రాకేష్ మాస్టర్ చనిపోయారని తెలిసి అభిమానులు షాక్‌కు గురయ్యారు.
ఎప్పుడూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా కనిపించే రాకేష్ మాస్టర్ మరణానికి వడదెబ్బే ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. వైజాగ్ నుంచి షూటింగ్ పూర్తి చేసి వస్తున్నసమయంలో ఆయన సన్ స్ట్రోక్‌కు గురైనట్లు సమాచారం. అప్పటి నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన రాకేష్ మాస్టర్ వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఆదివారం ఉదయానికి పరిస్థితి మరింత విషమించింది. విపరీతంగా రక్తపు విరేచనాలు అవ్వడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు.
1968లో తిరుపతిలో జన్మించారు రాకేష్ మాస్టార్... ఆట డ్యాన్స్ తో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత డాన్స్ మాస్టర్‌గా ఎదిగారు. ప్రముఖ హీరోలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు వంటి సినిమాలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి ప్రముఖ కొరియోగ్రాఫర్లు రాకేష్ మాస్టర్ శిష్యులే కావడం విశేషం. సినీ కెరీర్ అనంతరం యూట్యూబ్‌లో టాప్ హీరోలు, హీరోయిన్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి ఫేమస్ అయ్యారు. ఈటీవీ వేదికగా ప్రసారమైన డ్యాన్స్ షో ఢీ లో కూడా రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా చేశారు