Home > సినిమా > Thank you Poonam pandey: పుకార్లు వ్యాప్తిచేసిన పూనమ్ పాండేకు శిక్ష ఏంటి? ఆమెను అరెస్ట్ చేస్తారా?

Thank you Poonam pandey: పుకార్లు వ్యాప్తిచేసిన పూనమ్ పాండేకు శిక్ష ఏంటి? ఆమెను అరెస్ట్ చేస్తారా?

Thank you Poonam pandey: పుకార్లు వ్యాప్తిచేసిన పూనమ్ పాండేకు శిక్ష ఏంటి? ఆమెను అరెస్ట్ చేస్తారా?
X

ఏ వార్త చూసినా.. ఏ సోషల్ మీడియా అకౌంట్ స్క్రోల్ చేసినా.. నిన్నటి నుంచి ఒకటే వార్త. బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయిందని. ఈ వార్త స్వయంగా పూనమ్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచే రావడం, ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ మేనేజరే పోస్ట్ చేయడంతో నిజమేనని నమ్మారంతా. దీంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానులు శోకంలో మునిగిపోయారు. అంతా అయిపోయింది అనుకున్న టైంలో.. చావు కబురు చల్లగా చెప్పినట్లు.. ‘నేను బతికే ఉన్నాను’ అంటూ స్వయంగా పూనమ్ పాండేనే ఓ వీడియో రిలీజ్ చేసింది. నిన్న ఏ అకౌంట్ నుంచి చనిపోయినట్లు పోస్ట్ చేసిందో.. అదే అకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది.

సర్వైకల్ క్యాన్సర్ పై చాలామంది మహిళలకు అవగాహన లేదని.. దీనిపై అవగాహన కల్పించేందుకే తాను చనిపోయినట్లు ప్రచారం చేపించుకున్నట్లు పూనమ్ చెప్పుకొచ్చింది. ‘నేను బతికే ఉన్నా. సర్వైకల్ క్యాన్సర్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది మిగతా క్యాన్సర్ల మాదిరికాదు. ఈ వ్యాధిని నివారించడం సాధ్యమే. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ లేదా ముందస్తుగా గుర్తించడం అవసరం. ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. దీనిపై అందరికీ అవగాహన కల్పిద్దాం’అని వీడియోలో పూనమ్ చెప్పుకొచ్చింది. ఎప్పుడు సోషల్ మీడియాలో, బయట వివాదాల్లో ఇరుక్కునే పూనమ్ ఇలా ప్రాంక్ చేయడంపై.. అంతా మండిపడుతున్నారు. ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేసి అందరినీ ఫూల్ చేసినందుకు.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు.

ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 67 ప్రకారం పూనమ్ పాండేపై కేసు వేసి, జైలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా పుకార్లు వ్యాప్తిచేసి దోషిగా రుజువైతే.. అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది. రూ.5లక్షల జరిమానా విధిస్తారు. నేరం పునరావృతమైతే 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పలువురు పూనమ్ పై చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి తప్పు జరగకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు క్యాన్సర్ గురించి ఎన్ని రకాలుగా అవగాహన కల్పించాలని చూసినా ఎవరూ పట్టించుకోవట్లేదని, పూనమ్ పుకారు చావు వల్ల చాలామంది సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఈ విషయంలో పూనమ్ ను తప్పుబట్టొద్దని, తాను చేసింది తప్పైనా.. చేయాలనుకున్నది మాత్రం కరెక్ట్ అని సమర్థిస్తున్నారు. కాగా దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారు. ఆమెపై కేసు నమోదు చేస్తారా? లేదా తెలియాల్సి ఉంది.

Updated : 3 Feb 2024 3:44 PM IST
Tags:    
Next Story
Share it
Top