Home > సినిమా > 'డిజే టిల్లు స్క్వేర్'కు ఈ సారి హిట్ అంత ఈజీ కాదా..?

'డిజే టిల్లు స్క్వేర్'కు ఈ సారి హిట్ అంత ఈజీ కాదా..?

డిజే టిల్లు స్క్వేర్కు ఈ సారి హిట్ అంత ఈజీ కాదా..?
X

డిజే టిల్లు.. అంచనాలు లేకుండా వచ్చి అద్భుత విజయం సాధించిన సినిమా. రొమాంటిక్ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్ లా అనిపించినా.. చివర్లో వచ్చిన ట్విస్ట్ సూపర్బ్ గా వర్కవుట్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టిల పేర్లు టిల్లు, రాధిక అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ వేసిందీ కపుల్. సినిమా అంతా డైలాగ్ బుక్ లా కనిపించినా.. అందుకు తగ్గ పర్ఫెక్ట్ సీన్స్ కూడా పడటంతో కమర్షియల్ గానూ పెద్ద విజయం సాధించిందీ సినిమా. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లోనే సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఆ సీక్వెల్ రెడీ అయింది. డిజే టిల్లు స్క్వేర్ పేరుతో రూపొందిన ఈ మూవీ ఈ నెల 29న విడుదల కాబోతోంది.

ఈ సారి హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ నటించింది. ఇప్పటి వరకూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరగా కనిపించిన అనుపమ ఈ మూవీతో ఫస్ట్ టైమ్ లస్టీగా కనిపించబోతోంది. విపరీతంగా అందాలారబోయడమే కాదు.. లిప్ లాక్స్ తోనూ రెచ్చిపోయింది. అయితే ఈ మూవీకి సంబంధించి ముందు నుంచీ అంత పాజిటివ్ న్యూసేం రాలేదు. చాలా వరకూ రీ షూట్స్ కు వెళ్లిందన్నారు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇదంత స్పైసీగా ఏం లేదు అనే టాకూ వచ్చింది. దీంతో ఎక్కువ భాగం అనుపమ ఎక్స్ పోజింగ్ పైనే ఆధారపడ్డారు అనే గాసిప్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ పార్ట్ ఏదో అలా లక్కీగా హిట్ అయింది కానీ.. డిజే టిల్లు స్క్వేర్ కు ఈ సారి అంత ఈజీ కాదు అంటున్నారు.

తెలుగులో సీక్వెల్స్ సూపర్ హిట్ అయిన సందర్భాలు తక్కువ. ఆ సెంటిమెంట్ దీనికీ వర్తిస్తుందంటున్నారు. కొన్నిసార్లు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సీక్వెల్ అంటే ఇలాంటి నెగెటివ్ టాక్స్ ఉండటం కామనే. కానీ డిజే టిల్లు క్రేజ్ మాత్రం తగ్గలేదు. మరి సినిమాలో విషయం ఎంత అనేది రిలీజ్ అయితే కానీ తెలియదు. అప్పటి వరకూ మనం ఇలాంటి నెగెటివ్ న్యూస్ ను పెద్దగా పట్టించుకోనవసరం లేదేమో.


Updated : 25 March 2024 4:10 PM IST
Tags:    
Next Story
Share it
Top