'ఆడుజీవితం'కు ఆడే సీన్ లేదా?
X
హీరో పృథ్వీరాజ్ నటించిన ఆడుజీవితం (ది గోట్ లైఫ్) మూవీ మార్చి 28న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ కోసం హీరో పృథ్వీరాజ్ చాలా కష్టపడ్డాడు. తెలుగులో సైరా, గాడ్ ఫాదర్ వంటి ఆఫర్లను కూడా వద్దనుకున్నాడు. ది గోట్ లైఫ్ మూవీ షూటింగ్ సమయంలో హీరోకు కరోనా వచ్చింది. దీంతో అరబ్ కంట్రీలోనే పృథ్వీరాజ్ కొన్ని నెలల పాటు ఉండిపోవాల్సి వచ్చిందట. అయితే ఈ మూవీ ఎడారిలోనే ఎక్కువగా భాగం సాగుతుందని ట్రైలర్, టీజర్ చూస్తేనే తెలుస్తోంది. దీంతో ప్రేక్షకులు ఈ మూవీపై అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది.
సమ్మర్‌లో వచ్చే సినిమాల కోసం తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. కానీ ఈ మూవీ విషయానికి వచ్చేసరికి ఆడియన్స్ అంతగా మొగ్గు చూపడం లేదని అనిపిస్తోంది. ఈ మూవీ ట్రైలర్స్‌లో చూపించే విధానం కొందరికి అసహ్యంగా అనిపిస్తోందట. ఆకలితో అలమటించే హీరో గుబురు గెడ్డంతో పాటు పీక్కుపోయిన మొహంతో ఉంటాడు. అలా ఆ అవతారంలో హీరోను చూసేందుకు ఎవ్వరూ ఇష్టపడటం లేదట.
సమ్మర్‌లో ఎంటర్టైన్ చేసే మూవీస్ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. అయితే ఆడుజీవితం మూవీ అలా కాదని ఈపాటికే అందరికీ అర్థమైనట్లు అనిపిస్తోంది. అందుకే ఈ మూవీని చూసే వారి సంఖ్య అంతగా కనిపించడం లేదని తెలుస్తోంది. మొత్తానికి 'ఆడుజీవితం' మూవీకి ఆడే సీన్ లేదని పలువురు అంటున్నారు. ఈ మూవీతో పాటు వచ్చే డిజే టిల్లు స్క్వేర్‌పైనే ఎక్కువగా టాక్ వినిపిస్తోంది. అయితే రిజల్ట్ తెలియాలంటే ఫ్రైడే వరకూ వెయిట్ చేయాల్సిందే మరి.