ఇద్దరిదీ ఒకే ఆశ..ఖుషి రిజల్ట్ ఎలా ఉంటుందో?
X
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ఖుషి. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, మురళీశర్మ, జయరాం వంటి వారు కీ రోల్స్ పోషిస్తున్నారు. సామ్-విజయ్ భార్యభర్తలుగా నటించిన ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు . ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సెప్టెంబరు1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ , ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి . అలాగే ఇటీవల జరిగిన మ్యూజిక్ ఈవెంట్ సైతం గ్రాండ్ సక్సెస్ అయి సినిమా పై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది . సమంతా అందుబాటులో లేకపోవడంతో .. విజయ్ ఒక్కడితోనే చిత్ర యూనిట్ ప్రమోషన్లు చేస్తోంది. అయితే సమంతతో వీడియో కాల్స్ చేస్తూ హైప్ తగ్గకుండా చుస్తునారు. ఇప్పటికే మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న ఖుషి గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
విజయ్ దేవరకొండకు లైగర్ చేదు అనుభవాన్ని మిగిల్చింది . లైగర్ విడుదలకు ముందు హైప్ కోసం చేసిన ప్రయోగాలన్నీ కూడా రివర్స్ అయ్యాయి . అప్పటి నుంచి రౌడీ బాయ్ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. గీత గోవిందం తర్వాత విజయ్ అంత పెద్ద సక్సెస్ మళ్ళీ చూడలేదు. దీంతో ఇప్పుడు ఖుషి పైనే ఆశలు పెంచుకున్నాడు. సమంతా విషయానికి వస్తే శాకుంతలం ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు ఈ బ్యూటీ. . ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ సమంతకి కూడా చాలా అవసరం. వీరితో పాటే ఖుషి దర్శకుడు శివ నిర్వాణ కూడా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. నిన్ను కోరి, మజిలీ వంటి హిట్స్ తర్వాత తీసిన టక్ జగదీష్ తో శివకు గట్టి దెబ్బ తగిలింది . ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో విజయ్, సామ్, శివలకు ఖుషి సక్సెస్ కావడం చాలా కీలకంగా మారింది. పైగా ఎలాంటి పోటీ లేని అడ్వాంటేజ్‌తో బరిలో దిగుతున్న ఈ సినిమాకు సరిపడా థియేటర్లు దొరికాయి. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో , వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మరికొన్ని గంటల్లో తేలనుంది .