Home > సినిమా > హీరో విజయ్‎ని అరెస్ట్ చేయండి..తమిళ మహిళా నేత డిమాండ్

హీరో విజయ్‎ని అరెస్ట్ చేయండి..తమిళ మహిళా నేత డిమాండ్

హీరో విజయ్‎ని అరెస్ట్ చేయండి..తమిళ మహిళా నేత డిమాండ్
X

లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‎లో తమిళ సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లియో. ఫుల్ లెన్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ నుంచి విజయ్‌ బర్త్ డే సందర్భంగా ‘నా రెడీ’ అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ప్రస్తుతం ఆ పాట వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. నా రెడీ పాటలో మత్తు పదార్థాల వినియోగం, రౌడీయిజం ఎక్కువగా చూపించారంటూ కొంత మంది తమిళనాడు నేతలు కోర్టుకు వెళ్లారు. వారిలో ఆల్‌ పీపుల్స్‌ పొలిటికల్‌ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ కూడా ఉన్నారు. పాటపై వివాదం బయటికొచ్చినప్పటి నుంచి రాజేశ్వరి మీడియా ముఖగా పలుమార్లు విజయ్‌ని టార్గెట్‌ చేసి మాట్లాడింది. ఈ క్రమంలో విజయ్‌ ఫ్యాన్స్ తనని సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారని, అసభ్యకరంగా మాట్లాడుతున్నారని చెన్నై డీజీపీ కార్యాలయంలో రాజేశ్వరి ప్రియ కంప్లైంట్ ఇచ్చారు. అంతే కాదు హీరో విజయ్‎ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

" నేను పోరాటం చేస్తుంటే.. విజయ్‌ ఫ్యాన్స్ నన్ను సోషల్‌ మీడియాలో బెదిరిస్తున్నారు. నా పైన అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. విజయ్‌ ఐడీని ట్యాగ్ చేస్తూ నన్ను ట్రోల్ చేస్తున్నారు. నన్ను విజయ్‌ కూడా బెదిరించాడు. ఓ మహిళ అని చూడకుండా అసభ్యకరంగా మాట్లాడేలా విజయ్ తన అభిమానులను ప్రేరేపించాడు. అందుకు పోలీసులు విజయ్‌ని అరెస్టు చేయాలి’’ అని రాజేశ్వరి ప్రియ డిమాండ్ చేశారు. సినిమాల్లో చాలా మంది సిగిరెట్లు తాగుతారు.. మరీ విజయ్‌పైనే ఫిర్యాదు ఎందుకు చేశారని అని ప్రశ్నించగా..తాను గతంలో రజనీకాంత్‌పై కూడా ఇదే విషయంలో ఫిర్యాదు చేశామని తెలిపారు.


Updated : 7 July 2023 4:43 PM IST
Tags:    
Next Story
Share it
Top