Home > సినిమా > 'యమధీర' మూవీ టీజర్ లాంచ్..విలన్‌గా క్రికెటర్ శ్రీశాంత్

'యమధీర' మూవీ టీజర్ లాంచ్..విలన్‌గా క్రికెటర్ శ్రీశాంత్

యమధీర మూవీ టీజర్ లాంచ్..విలన్‌గా క్రికెటర్ శ్రీశాంత్
X

కన్నడ హీరో కోమల్ కుమార్ 'యమధీర' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్న ఈ మూవీని శ్రీమందిరం ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. వేదాల శ్రీనివాస్ రూపొందిస్తోన్న యమధీర మూవీలో నాగబాబు, ఆలీ, సత్యప్రకాష్, మధుసూధన్ వంటివారు కీలక పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమం సినీ ప్రముఖుల మధ్య జరిగింది. నటుడు, ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ యమధీర మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు.

టీజర్ లాంచ్ సందర్భంగా నిర్మాత వేదాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇది తన తొలి చిత్రమని, సినిమాల మీద ఫ్యాషన్‌తో శ్రీమందిరం ప్రొడక్షన్స్‌ను ప్రారంభించానని తెలిపారు. తమ తొలి సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. త్వరలోనే యమధీర మూవీ థియేటర్లలో విడుదల కానుందన్నారు.

అశోక్ కుమార్ మాట్లాడుతూ..శ్రీమందిరం ప్రొడక్షన్స్‌లో తొలి చిత్రంగా వస్తున్న యమధీర మంచి విజయం సాధించాలన్నారు. కన్నడలో 90కి పైగా సినిమాలలో నటించిన కోమల్ కుమార్ ఈ మూవీలో హీరోగా నటించారని, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఇందులో విలన్‌గా చేశారన్నారు. యమధీర మూవీని అజర్ బైజాన్, శ్రీలంక వంటి దేశాలతో పాటు మైసూర్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. సినిమాను ఆదరించి విజయాన్ని అందించాలని కోరారు.



Updated : 14 March 2024 4:13 PM IST
Tags:    
Next Story
Share it
Top