'యమధీర' వచ్చేది అప్పుడే
X
కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా వస్తోన్న చిత్రం యమధీర. ఈ మూవీలో ఇండియన్ మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్‌లో వేదాల శ్రీనివాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. వారి ప్రొడక్షన్స్‌లో వస్తున్న తొలి చిత్రం 'యమధీర'. ఈ మూవీలో నాగబాబు, ఆలీ, సత్యప్రకాష్, మధుసూధన్ వంటివారు నటిస్తున్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన మూవీ టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత వేదాల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ..ఈ మూవీ ఈవీఎం ట్యాంపరింగ్ పైన రూపొందుతోందన్నారు. అజర్ బైజాన్ దేశంలో ఈ మూవీని ఎక్కువగా షూట్ చేశామన్నారు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారన్నారు. అందుకే ఎక్కువ థియేటర్లలో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
మార్చి 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. మూవీని సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరారు. ఇకపోతే కన్నడలో 100 సినిమాల్లో నటించిన కోమల్ కుమార్ ఇందులో హీరోగా చేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇందులో విలన్‌గా కనిపించనున్నారు. భారీ తారగణంతో తెరకెక్కిన ఈ మూవీపై సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ అయ్యింది. పైగా ఎన్నికల సమయంలోనే వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.