యాత్ర-2 ట్రైలర్ రిలీజ్..ఫిబ్రవరి 8న సినిమా విడుదల
X
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా, తమిళ హీరో జీవా సీఎం జగన్‌గా నటిస్తున్న మూవీ యాత్ర-2, మహీ వి రాఘన్ (Mahi v Raghav) ఈ సినిమాకి దర్శకుడు. గతంలో వైఎస్సార్ రాజకీయ జీవిత చరిత్ర యాత్ర మూవీకి ఇది సీక్వెల్. తాజాగా యాత్ర-2 చిత్రం
(Yatra-2 movie) నుంచి ట్రైలర్ విడుదల అయింది. వైఎస్సార్ మరణం తర్వత జరిగిన రాజకీయ పరిస్థితులు, జగన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కొత్త పార్టీ చేయటం అనంతరం జరిగిన పరిణామలు జగన్ జైలు జీవితం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం తదితర అంశాలను ఈ ట్రైలర్ లో చూపించారు. ఓ అంధుడితో మాట్లాడుతూ.. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ జగన్ పాత్రధారి జీవా (Jeeva) పలికిన డైలాగ్ భావోద్వేగభరితంగా ఉంది.
యాత్ర-2 చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) మరణం తర్వాత జరిగిన పరిణామాలను అప్పట్లో జగన్ ఏ విధంగా ఎదుర్కున్నారనే స్టోరితో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో పలువురు ప్రముఖ నేతల క్యారెక్టర్స్‌ను కూడా చూపించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ (AP) లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘యాత్ర 2’ ఉంటుందని మూవీ టీం తెలిపింది. సోనియాగాంధీ, చంద్రబాబు(Chandrababu)ను పోలిన పాత్రలు యాత్ర 2 ట్రైలర్‌లో కనిపిస్తాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు రిలీజ్ అయిన ఈ యాత్ర సినిమా వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. ఏపీలో జరిగిన రాజకీయ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు సాంగ్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.