Home > సినిమా > సినిమా షూటింగ్లో గాయపడ్డ యంగ్ హీరో

సినిమా షూటింగ్లో గాయపడ్డ యంగ్ హీరో

సినిమా షూటింగ్లో గాయపడ్డ యంగ్ హీరో
X

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. అతని కాలుకు బలమైన గాయం అయింది. ఆర్యన్ శుభాన్ దర్శకత్వం వహిస్తున్న ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్ చేస్తుండగా వరుణ్ సందేశ్ గాయపడినట్లు మూవీ యూనిట్ తెలిపింది. దాంతో ఆయనను వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించామని.. పరీక్షలు జరిపిన వైద్యులు 3 వారాలు రెస్ట్ తీసుకోవాలని సూచించారని తెలిపారు. ఆ కారణంగా షూటింగ్ 3 వారాలు షూటింగ్ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. సందీప్ కిషన్ ‘మైఖేల్’ సినిమా తర్వాత వరుణ్ నటిస్తున్న సినిమా ది కానిస్టేబుల్. ఇందులో వరుణ్ కానిస్టేబుల్ గా కనిపించనున్నాడు. ఆర్యన్ శుభాన్ డైరెక్టర్ లో.. జాగృతి మూవీ మేకర్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయింది.





Updated : 21 Jun 2023 9:22 PM IST
Tags:    
Next Story
Share it
Top