Home > సినిమా > సినీనటిపై దాడి చేసిన యువకుడు.

సినీనటిపై దాడి చేసిన యువకుడు.

సినీనటిపై దాడి చేసిన యువకుడు.
X

సినీనటిపై దాడి చేసిన ఘటనలో ఓ యువకుడిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మూసాపేటలోని ఆంజనేయనగర్‌కు చెందిన యువతి (23) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తుంది. ఈ క్రమంలో శ్రీనగర్‌కాలనీ గణపతి కాంప్లెక్స్‌లో నివసించే గంగినేని గణేష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇటీవల వీరి మధ్య విభేదాలు తలెత్తగా.. దీంతో ఎవరికి వారుగా వీడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 7న యువతికి పోన్ చేసిన గణేష్‌ చిలుకూరు బాలాజీ గుడిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన ఇంటికి రప్పించాడు. ఇంటికి వచ్చిన యువతిని గణేష్‌ తన సోదరులు శ్రీను, వంశీ, శ్రీకాంత్, అక్షయ్‌తో కలిసి మైత్రీవనం ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెను తీవ్రంగా కొట్టడంతో పాటు ఫోన్‌ను ధ్వంసం చేశాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు పిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గణేష్‌తో పాటు శ్రీను, వంశీ, శ్రీకాంత్, అక్షయ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated : 11 Jan 2024 6:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top