Home > సినిమా > విన్నాను..భరించాను..ఇక ఆగడాలు లేవ్..మంచు మనోజ్

విన్నాను..భరించాను..ఇక ఆగడాలు లేవ్..మంచు మనోజ్

విన్నాను..భరించాను..ఇక ఆగడాలు లేవ్..మంచు మనోజ్
X

దొంగ.. దొంగది మూవీతో సినీ రంగంలోకి ఎంటర్ అయ్యాడు మంచు మనోజ్. తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నటించిన కొన్ని సినిమాలు హిట్ కొడితే, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి . అయినా తన జర్నీని ఎక్కడా ఆపలేదు. సినిమాల మీద ఉన్న ఇష్టం, గౌరవాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాడు. చివరగా 2018లో మంచు మనోజ్ నటించిన ఆపరేషన్ 2019 కూడా నిరాశనే మిగిల్చింది. దీంతో సినిమాలకు కాస్త దూరం ఉంటూ వస్తున్నాడు మనోజ్. ఇక 2022లో భూమా మౌనికను సెకెండ్ మ్యారేజ్ చేసుకుని తన పర్సనల్ లైఫ్‎లో హ్యామిగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మధ్యలో బ్రేక్ పడిన తన సినీ కెరీర్‌ను మళ్లీ ట్రాక్‎లోకి తీసుకువచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు మళ్లీ ప్రారంభించాడు. ఈ మధ్యనే తన సొంత ప్రొడక్షన్‌‎లో అహం బ్రహ్మస్మి చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. అప్పటి నుంచి తన సినిమాలపై ఎలాంటి అప్‎డేట్స్ ప్రకటించలేదు. తాజాగా మనోజ్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్‌ చేశాడు. ఈ వీడియోలోని మంచు మనోజ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

“ సినిమానే నా ప్రపంచం . చిన్నప్పటి నుంచి సినిమాల మీద పెంచుకున్న ప్రేమ కారణంగానే ఇదే నా వృత్తిగా మారింది. నన్ను ఒక నటుడిని చేసింది. రాకింగ్ స్టార్‎గా మార్చింది. ఫ్యాన్స్ ఈలలు, అరుపులు, కేకలతో నా జీవితం ఓ పండగాలా ఉండేది. కానీ ఉన్నట్లుండి నా జీవితంలో ఆ సందడి పోయి సైలెన్స్ వచ్చింది. మనోజ్ కెరీర్ ఖతమన్నారు. ఒక సినిమాలు చేయడన్నారు. ఇండస్ట్రీకి తిరిగి రాడన్నారు. రాకింగ్ స్టార్‎లో ఎనర్జీ తగ్గిందన్నారు. అన్నీ ఓపికగా భరించాను కానీ రెట్టింపు ఎనర్జీతో తిరిగొస్తున్నాను"..అంటూ ఆ వీడియోను షేర్ చేశాడు. ట్విటర్‎లో మనోజ్ షేర్ చేసిన ఓ పోస్టర్ ద్వారా మనోజ్ ఓ గేమ్ షోతో అలరించబోతున్నాడని అర్థం అవుతోంది.





Updated : 23 Sept 2023 12:47 PM IST
Tags:    
Next Story
Share it
Top