Home > సినిమా > బిగ్బాస్ 7 సీజన్లో బ్యాంకాక్ పిల్ల.. త్వరలో ఇండియాకు..!

బిగ్బాస్ 7 సీజన్లో బ్యాంకాక్ పిల్ల.. త్వరలో ఇండియాకు..!

బిగ్బాస్ 7 సీజన్లో బ్యాంకాక్ పిల్ల.. త్వరలో ఇండియాకు..!
X

బుల్లి తెర ఆడియన్స్ కు బిగ్ బాస్ సుపరిచితమే. ఆ మ్యూజిక్ వింటేనే ఎగ్జైట్ అయిపోతుంటారు. ముక్కూముఖం తెలియని కంటెస్టెంట్స్ ను.. కళ్లప్పగించి చూస్తుంటారు. ఫ్యాన్ పేజ్ లు పెట్టుకుని కొట్టుకుంటారు. గంటల తరబడి టీవీలకు అతుక్కుపోతుంటారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేసింది. ఇక అప్పటినుంచి బిగ్ బాస్ ఆడియన్స్ లో ఆత్రుత మొదలయింది. ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తారని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యూట్యూబర్ బిగ్ బాస్ కు వస్తున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది

బ్యాంకాక్ పిల్ల.. యూట్యూబ్ చానల్ అందరికీ తెలిసిందే. విజయనగరానికి చెందిన సామంతపూడి శ్రావణి.. థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ లో ఉంటుంది. అక్కడి విషయాలు, తన పిల్లలతో గడిపిన సరదా సన్నివేశాలన యూట్యూబ్ వీడియోల ద్వారా చూపిస్తూ.. 2 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. అందులో చాలామంది ఆవిడ చెప్పే మాటలు, యాసకే ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 7లో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో ‘త్వరలో ఇండియాకు రాబోతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవలే ఇండియా నుంచి బ్యాంకాక్ వెళ్లిన ఆమె.. ఇంతలోనే మళ్లీ తిరిగి వస్తుండే సరికి అందరిలో అనుమానం మొదలయింది. బిగ్ బాస్ కోసమే మళ్లీ ఇండియాకు తిరిగి వస్తుందంటూ చర్చలు జరుగుతున్నాయి. అదే నిజం అయితే.. ఈ సీజన్ లో ఫుల్ టైం ఎంటర్ టైన్మెంట్ పక్కా వస్తుందని అనుకుంటున్నారు నెటిజన్స్.



Updated : 12 July 2023 6:41 PM IST
Tags:    
Next Story
Share it
Top