Home > సినిమా > బాలకృష్ణకు యువరాజ్ సింగ్ బర్త్‎డే విషెస్

బాలకృష్ణకు యువరాజ్ సింగ్ బర్త్‎డే విషెస్

బాలకృష్ణకు యువరాజ్ సింగ్ బర్త్‎డే విషెస్
X

నేడు నందమూరి బాలకృష్ణ 63వ పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ,క్రీడా, రాజకీయ ప్రముఖులు బర్త్‎డే విషెస్ తెలుపుతున్నారు. భారత్ మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సైతం బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు. "నందమూరి బాలకృష్ణ సర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. క్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజానికి అంకిత భావంతో మీరు చేస్తున్న సేవలు స్పూర్తిదాయకం. ఈ ఏడాది మీరు చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ యువరాజ్ సింగ్ తెలిపారు. అలాగే గతంలో బాలయ్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు.

నటుడిగా, ఎమ్మెల్యేగా బాలయ్య తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‏స్టిట్యూట్ చైర్మన్ గా ఉంటూ అనేక సేవలు అందిస్తున్నారు. క్రికెటర్ యువరాజ్ సింగ్ 2011లో క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుని పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నారు. అప్పటినుంచి ఓ ఫౌండేషన్ స్టార్ట్ చేసి క్యాన్సర్ బాధితులకు సాయం చేస్తున్నారు. అదే సమయంలో యూవీ బసవతారకం ఆసుపత్రికి అవసరం సమయంలో సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణతో పరిచయం ఏర్పడింది.

బాలకృష్ణ ప్రస్తుతం రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమాల నటిస్తున్నారు. పుట్టిన రోజు కానుకగా నేడు ‘భగవంత్ కేసరి’ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన కాసేపట్లోనే టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.ఇది బాలయ్య 108వ సినిమా కాగా..దసరాకు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తుంది చిత్ర యూనిట్.



Updated : 10 Jun 2023 3:43 PM IST
Tags:    
Next Story
Share it
Top