Rajinikanth Lal Salaam: బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన 'లాల్ సలామ్'
X
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయన సినిమా ఎప్పుడు విడుదలైనా భారీ ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆయన నటించిన తాజా చిత్రం లాల్ సలామ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమాను పట్టించుకునే నాథుడే లేదు. అసలు లాల్ సలామ్ సినిమా అనేది ఒకటి విడుదలైందని చాలా మందికి తెలియడం లేదు. మొదటి రోజు కలెక్షన్స్ గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడమే లేదు. ఈ మూవీకి ఓపెనింగ్స్ ఏమీ లేవని, తొలి రోజే జీరో షేర్ వచ్చిందని సినీ ఇండస్ట్రీలో జోరుగా చర్చించుకుంటున్నారు.
లాల్ సలామ్ మూవీలో రజినీకాంత్ మెయిన్ రోల్ చేసినప్పటికీ ఈ మూవీని ఆయన కూతురు ఐశ్వర్య తీసింది. లైకా వంటి భారీ ప్రొడక్షన్ హౌస్ ఈ మూవీని రూపొందించింది. కానీ అవేవీ జనాల్లోకి వెళ్లలేదు. విష్ణు విశాల్ అంటే కూడా తెలుగులో చాలా మందికి తెలిసినా ఆ మూవీని చూసేందుకు ఎవ్వరూ ఆసక్తిచూపడం లేదు. అయితే ఫిబ్రవరి 9వ తేదిన రవితేజ మూవీ ఈగల్ విడుదలైంది. ఈగల్ మూవీ వల్ల లాల్ సలామ్ కనిపించకుండా పోయిందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
జైలర్ మూవీ తర్వాత వచ్చే సినిమా ఓ రేంజ్‌లో ఉండాలి. కానీ లాల్ సలామ్ మూవీకి పబ్లిషిటీ ఏమాత్రం చేయలేదనిపిస్తోంది. ఆ మూవీ చూసిన కొందరు కూడా అది బాగాలేదని చెప్పేస్తున్నారు. మౌత్ టాక్‌తో అయినా సినిమా నిలబడుతుందని అనుకుంటుంటే ఈ మూవీకి అది కూడా లేదు. ఇన్నేళ్ల రజినీ కెరీర్‌లో ఇలాంటి రోజు ఎప్పుడూ రాలేదని రజినీ అభిమానులే చర్చించుకుంటున్నారు. ఇకపోతే వీకెండ్‌లో కూడా ఈ మూవీ పరిస్థితి అలానే ఉంది. సోమవారం నుంచి ఆ మూవీని ఎత్తేసేలా ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి లాల్ సలామ్ మూవీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుందని చెప్పాలి.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.