Home > క్రికెట్ > జైస్వాల్‎కు చోటు..సంజూ శాంసన్ పై వేటు ..?

జైస్వాల్‎కు చోటు..సంజూ శాంసన్ పై వేటు ..?

జైస్వాల్‎కు చోటు..సంజూ శాంసన్ పై వేటు ..?
X

వెస్టీండీస్‎తో జరుగుతున్న ఐదు టీ20 సిరీస్‌‌లో భారత్ వరుసుగా రెండు మ్యాచ్ లలో ఓటమి చవిచూసింది. రెండు మ్యాచ్ లలోనూ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మరో మ్యాచ్ చేజారితే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో మంగళవారం జరగబోయే మూడో టీ20 కీలక కానుంది. విజయాల పరంపరను కొనసాగించి సిరీస్ పట్టేయాలని కరేబియన్లు చూస్తుంటే..విండీస్ జోరుకు బ్రేక్ వేసి సిరీస్‌లో నిలవాలని టీమిండియా భావిస్తోంది.





ఇక రేపటి మ్యాచ్ లో గెలుపు కోసం టీమిండి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ లో అదరగొట్టి..ఆరంగ్రేట టెస్ట్ మ్యాచ్ లోనే వెస్టిండీస్ పై సెంచరీ బాదేసిన జైశ్వాల్ ను చోటిచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే జైశ్వాల్ కు చోటిస్తే ఎవరిపై వేటు పడుతుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. శుభ్‌మన్ గిల్‌ను తప్పిస్తే ఓపెనర్లుగా ఇద్దరూ లెఫ్టాండర్లే ఉండనున్నారు. టీ20ల్లో వరల్డ్ నెంబర్ వన్ అయిన సూర్యకుమార్ యాదవ్‌ను పక్కనపెట్టే అవకాశాలు లేవు. రెగ్యూలర్ కీపర్ గా ఇషాన్ కిషన్ నే ఆడించే ఛాన్స్ ఉంది. దీంతో మరొకసారి సంజూశాంసన్ పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. మొదటి మ్యాచ్ లో 12 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగన సంజూ..రెండో టీ20లో కేవలం 7 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. మూడో టీ20లో సంజూ తుదిజట్టులో లేకపోతే అతడిని మరొకసారి దురదృష్టం వెంటాడినట్లే.

ఒకే ఒక్కడు





తెలుగు తేజం తిలక్ వర్మ మినహా మిగిలన్ బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించడం లేదు. విండీస్ బౌలర్లను ఎదుర్కోలేక చేతులెత్తేస్తున్నార. తిలక్ వర్మ తన అసాధరణ బ్యాటింగ్ తో చెలరేగుతున్నాడు. అంతర్జాతీయంగా మొదటి సిరీస్ ఆడుతున్నా..ఏ మాత్రం భయం, బెణుకు లేకుండా విజృంభిస్తున్నాడు. తొలి టీ20లో 39 పరుగులు చేసిన తిలక్ రెండో టీ20లో మొదటి అర్థసెంచరీని సాధించాడు. తిలక్ వర్మ తరహాలో మిగిలిన ఆటగాళ్లు చెలరేగితే మూడో టీ20లో విండీస్ పై విజయం సాధించ అవకాశాలు ఉన్నాయి.




Updated : 7 Aug 2023 7:12 PM IST
Tags:    
Next Story
Share it
Top