WTC ఫైనల్ మ్యాచ్ ముందు ఆస్ట్రేలియాకు షాక్..
X
WTC ఫైనల్ మ్యాచ్ ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. హాజిల్‍వుడ్ స్థానంలో ఆల్‍రౌండర్ మైకేల్ నెసెర్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
గత కొంతకాలంగా తొడ కండరాలు గాయంతో హాజిల్‍వుడ్ బాధపడుతున్నాడు. ఈ కారణంగానే ఐపీఎల్‌లో కూడా కొన్ని మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. ఇప్పటికే గాయం నుంచి కోలుకోకపోవడంతో ఫైనల్ మ్యాచ్‌కు మూడు రోజులు ముందు జట్టు నుంచి తప్పించారు. ఈ నెలలోనే ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్ కోసం హాజిల్‍వుడ్ కోలుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఆశిస్తోంది.
WTC ఫైనల్ మ్యాచ్ ముందు ఆస్ట్రేలియాకు షాక్..
హాజిల్‌వుడ్ స్థానంలో 33 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్ మైఖేల్ నెసర్ ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో గ్లామోర్గన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నాడు.కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నెసర్ 25.63 సగటున 19 వికెట్లు పడగొట్టి పామ్ లో ఉండడంతో ఆస్ట్రేలియా జట్టుకు ఎంపిక చేశారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ భారత్ ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి ప్రారంభం కానుంది. వేదిక ఓవల్ మైదానం.