Home > క్రీడలు > టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్ బ్యాటింగ్..

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్ బ్యాటింగ్..

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్ బ్యాటింగ్..
X

ఐదు టీ20ల సిరీస్లో భాగంగా భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 జరుగుతోంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో మరో గెలుపుపై కన్నేసింది. అయితే ఈ మ్యాచ్లో గెలిచి ఫామ్ లోకి రావాలని ఆసీస్ ప్రయత్నిస్తోంది. తిరువనంతపురం పిచ్ బౌలింగ్ కు అనుకూలించనుంది. ఈ క్రమంలో గెలుపు ఎవరినీ వరిస్తుందో మరికొన్ని గంటల్లో తేలనుంది.

భారత్‌ జట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్‌ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇప్పటికే 1-0తో భారత్‌ ఆధిక్యంలో ఉంది.

ఆస్ట్రేలియా : స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లీస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ

Updated : 26 Nov 2023 8:47 PM IST
Tags:    
Next Story
Share it
Top