Home > క్రికెట్ > ఆసియా కప్.. ఇండియా ఏ టీం ప్రకటన.. జట్టులో తెలుగబ్బాయి

ఆసియా కప్.. ఇండియా ఏ టీం ప్రకటన.. జట్టులో తెలుగబ్బాయి

ఆసియా కప్.. ఇండియా ఏ టీం ప్రకటన.. జట్టులో తెలుగబ్బాయి
X

ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనున్న ఈ టోర్నీకి జూనియర్ క్రికెట్ కమిటీ 15 మందితో కూడిన ఇండియా ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్ బై ప్లేయర్ గా అవకాశం కల్పించింది. జులై 13- 23వరకు జరిగే ఈ టోర్నీలో 8 దేశాలు పాల్గొననున్నాయి. ఈ జట్టుకు యశ్ ధుల్ నాయకత్వం వహిస్తాడు.





విశాఖకు చెందిన నితీశ్ కుమార్ రెడ్డికి ఈ జట్టులో అవకాశం దక్కింది. ఈ 20ఏళ్ల ఆల్ రౌండర్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ టీంలో సభ్యునిగా ఉన్నాడు. 2018లో బీసీసీఐ అందించిన వార్షిక పురస్కారాల్లో.. అండర్ -16 విభాగంలో నితీశ్ కు.. బెస్ట్ క్రికెటర్ అవార్డు దక్కింది.





జట్టు: యశ్ ధుల్ (C), అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, నికిన్ జోస్, ప్రదోష్, రియాన్ పరాగ్, నిషాంత్ సంధు, ప్రభ్సిమ్రాన్ సింగ్, ధ్రువ్ జురేల్, మానవ్ సుతార్, యువరాజ్సింగ్ దోడియా, హర్షిత్ రాణా, ఆకాశ్ సింగ్, నితీష్ కుమార్, రాజ్య వర్ధన్.




Updated : 5 July 2023 9:12 AM IST
Tags:    
Next Story
Share it
Top