Home > క్రికెట్ > వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. ఉప్పల్లో మ్యాచ్ లేనట్టే..?

వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. ఉప్పల్లో మ్యాచ్ లేనట్టే..?

వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. ఉప్పల్లో మ్యాచ్ లేనట్టే..?
X

టెస్ట్ ఛాంపియన్ షిప్ ముగిసింది. క్రికెట్ అభిమానులను ముంచెత్తడానికి మరో గ్రాండ్ ఈవెంట్ రెడీ అవుతోంది. భారత్ వేదికగా.. అక్టోబర్ 5 నుంచి జరగబోయే వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ముసాయిదా (డ్రాఫ్టింగ్ షెడ్యూల్) షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ ఐసీసీతో పంచుకుంది. ఐసీసీ.. తర్వాత మిగతా దేశాలకు పంచుతుంది. ఇతర దేశాలు కూడా ఈ షెడ్యూల్ పై ఫీడ్ బ్యాక్ ఇచ్చి, సమ్మతిస్తే.. ఐసీసీ ఆమోదిస్తుంది. అప్పుడు ఫైనల్ షెడ్యూల్ ను విడుదల చేస్తారు.




అయితే, హైదరాబాద్ అభిమానులకు చేదు వార్త అని చెప్పొచ్చు. బీసీసీఐ విడుదల చేసిన ముసాయిదా షెడ్యూల్ లో.. టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఉప్పల్ స్టేడియంలో లేదు. దాంతో హైదరాబాద్ అభిమానుల్లో తీవ్ర నిరాశ ఎదురైంది. వరల్డ్ కప్ లో చెన్నై వేదికపై అక్టోబక్ 9న టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత ఢిల్లీ, అహ్మ‌దాబాద్‌, పూణే, ధ‌ర్మ‌శాల‌, ల‌క్నో, ముంబై, కోల్‌క‌తా వేదిక‌లుగా త‌దుప‌రి మ్యాచ్‌ల‌ు జరుగుతాయి. దేశంలోని అన్ని ప్రధాన స్టేడియాలకు అవకాశం కల్పించిన బీసీసీఐ.. ఉప్పల్ స్టేడియాన్ని మాత్రం విస్మరించింది.




తొలి మ్యాచ్ ఏవరిదంటే..:

అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 19న అహ్మదాబాద్ లో ఫైనల్ జరుగుతుంది. నవంబర్ 15, 16 తేదీల్లో జరగబోయే సెమీ ఫైనల్ కోసం ఇంకా వేదకను ప్రకటించలేదు.

భారత్ షెడ్యూల్:

అక్టోబర్‌ 8న- ఆస్ట్రేలియాతో.. చెన్నై వేదికపై

అక్టోబర్‌ 11న- అఫ్గానిస్థాన్‌తో.. ఢిల్లీ వేదికపై

అక్టోబర్‌ 15న- పాకిస్థాన్‌తో.. అహ్మదాబాద్ వేదికపై

అక్టోబర్‌ 19న- బంగ్లాదేశ్‌తో.. పుణె వేదికపై

అక్టోబర్‌ 22న- న్యూజిలాండ్‌తో .. ధర్మశాల వేదికపై

అక్టోబర్‌ 29న- ఇంగ్లాండ్‌తో.. లక్నో వేదికపై

నవంబర్‌ 2న- క్వాలిఫయర్‌ జట్టుతో.. ముంబై వేదికపై

నవంబర్‌ 5న- దక్షిణాఫ్రికాతో.. కోల్ కతా వేదికపై

నవంబర్‌ 11న- క్వాలిఫయర్‌ జట్టుతో.. బెంగళూరు వేదికపై

Updated : 12 Jun 2023 5:25 PM IST
Tags:    
Next Story
Share it
Top