రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న ఇంగ్లండ్ కెప్టెన్
X
భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు ముందు ఇంగ్లండ్ జట్టుకు శుభవార్త అందింది. ఆ జట్టు టెస్ట్ కెప్టెన్, 2019 వరల్డ్ కప్ అందించిన స్టార్ బ్యాట్స్ మెన్ బెన్ స్టోక్స్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం (ఆగస్టు 16) సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. మరో 50 రోజుల్లో జరగనున్న వరల్డ్ కప్ కోసం అతడిని జట్టులోకి తీసుకోవాలని ఇంగ్లాండ్ బోర్డు నిర్ణయించింది. దానికోసం స్టోక్స్ తో మంతనాలు జరిపి రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో స్టోక్స్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
వరల్డ్ కప్ కు సన్నాహాల్లో భాగంగా ఇంగ్లండ్.. న్యూజిలాండ్ జట్టుతో వన్డే సిరీస్ ఆడనుంది.సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభం కాబోయే వన్డ్ సిరీస్ కు ఇంగ్లండ్ జట్టు జట్టును ప్రకటించింది. ఆ సిరీస్ కు స్టోక్స్ ను ఎంపిక చేసింది. గత వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై అద్భుతంగా ఆడిన స్టోక్స్.. ఒంటి చేత్తో ఇంగ్లాండ్ కు కప్పు అందించిన విషయం తెలిసిందే.