Home > క్రికెట్ > చరిత్ర సృష్టించేందుకు సిద్ధం.. మొదటి సిరీస్తోనే

చరిత్ర సృష్టించేందుకు సిద్ధం.. మొదటి సిరీస్తోనే

చరిత్ర సృష్టించేందుకు సిద్ధం.. మొదటి సిరీస్తోనే
X

టీమిండియా పేసుగుర్రం జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. ఆగస్టు 18 నుంచి ఐర్లాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ లో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి.. రఫ్పాడించేందుకు సిద్ధమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా దాదాపు ఏడాదిగా టీమిండియాకు దూరమైన బుమ్రా ఎంట్రీ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. అతని ఇంపాక్ట్ లేక ఆసియా కప్, ప్రపంచకప్, టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కు ముందు జట్టులోకి బుమ్రా ఎంట్రీ ఇస్తుండే సరికి ఫ్యాన్స్ లో జోష్ పెరిగింది. భారత పేస్ దళం మరింత బలపడింది.





ఈ క్రమంలో బుమ్రా అరుదైన రికార్డ్ ను నెలకొల్పాడు. టీమిండియా చరిత్రలో ఏ బౌలర్ కు సాధ్యం కాని రికార్డ్ ను క్రియేట్ చేయబోతున్నాడు. ఇప్పటివరకు టీ20లకు 10 మంది సారథ్యం వహించగా.. 11వ కెప్టెన్ గా, టీమిండియా నుంచి సారథ్యం వహిస్తున్న తొలి బౌలర్ గా రికార్డ్ సృష్టించబోతున్నాడు. ఇప్పటివరకు టీమిండియాకు కెప్టెన్లుగా.. వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ సారథ్యం వహించారు. ఈ సిరీస్ తో బుమ్రా 11వ కెప్టెన్ గా లిస్ట్ లో చేరబోతున్నాడు.




Updated : 16 Aug 2023 10:58 PM IST
Tags:    
Next Story
Share it
Top