Odisha train Incident : రైలు ప్రమాద బాధితులకు కోహ్లీ, ధోనీ సాయం.. నిజమేనా
Mic Tv Desk | 5 Jun 2023 5:55 PM IST
X
X
ఒడిశా రైలు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 275 మంది చనిపోయారు. 11వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదంపై కొన్ని ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవాళ (మే 5) ఉదయం.. రైలు ప్రమాద బాధితులకు చెన్నై కెప్టెన్ ధోనీ రూ.60కోట్లు దానం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఒడిశా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ధోనీ ఎటువంటి విరాళం ఇవ్వలేదని చెప్పారు.
అలాగే నిన్న (మే4) విరాట్ కోహ్లీ కూడా బాధితుల కోసం.. రూ.30కోట్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో కూడా నిజం లేదన్నారు పోలీసులు. ప్రజలు ఫేక్ వార్తలు నమ్మొద్దని సూచించారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఫేక్ న్యూస్లు ఎవరూ ఫార్వర్డ్ చేయొద్దని సూచించారు.
Updated : 5 Jun 2023 5:55 PM IST
Tags: odisha police clarity Odisha train accident latest news telugu news Odisha Train Mishap coromandal express navajeevan express virat kohli donation dhoni donation
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire