దిక్కులు చూడటం తర్వాత.. ముందు బ్యాటింగ్ చెయ్.. కోపంతో సిరాజ్ ఏం చేశాడంటే..!
X
ఓవల్ వేదికపై టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో రెండో రోజు ఆసక్తకర ఘటన చోటుచేసుకుంది. అద్భుత బ్యాటింగ్ తో రెచ్చిపోయిన స్టీవ్ స్మిత్.. సిరాజ్ కు కోపం తెప్పించాడు. స్మిత్ చర్యకు విసిగి పోయిన సిరాజ్.. తనవైపు బాల్ విసిరాడు. దీనికి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వత్తాసు పలికాడు.
అసలేం జరిగిందంటే.. ఇన్నింగ్స్ 86వ ఓవర్ మూడో బంతి వేయడానికి సిద్ధమైన సిరాజ్.. క్రీజ్ వరకు పరిగెత్తుకొచ్చాడు. బాల్ డెలివరీ చేయబోతుండగా.. స్మిత్ క్రీజ్ నుంచి పక్కకు జరిగాడు. దాంతో సిరాజ్ వెంటనే స్మిత్ వైపు కోపంగా బాల్ విసిరాడు. స్మిత్ చర్యకు రోహిత్ కూడా షాక్ తిన్నాడు. అయితే, స్మిత్ మాత్రం తనకు స్పైడర్ కెమెరాలు అడ్డురావడంతో పక్కకు జరిగినట్లు వివరించాడు. స్మిత్ చెప్తుంటే సిరాజ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘నేను రనప్ తీసుకోకముందే ఆపి ఉండాల్సింది. క్రీజ్ దగ్గరికి వచ్చాక పక్కకు జరగడం ఏంటి. ఇది విసిగించడమే’ అంటూ సిరాజ్ ఫైర్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— Nihari Korma (@NihariVsKorma) June 8, 2023