లవ్ జిహాద్ వివాదంలో గుజరాత్ బౌలర్ యశ్ దయాల్..
X
గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ లవ్ జిహాద్‌కు సంబంధించిన ఓ కార్టూన్ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి వివాదంలో చిక్కుకున్నాడు. అనంతరం ఆ పోస్ట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు కోరాడు. అయితే అప్పటికే నష్టం జరిగిపోవడంతో యశ్ దయాల్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోస్ట్‌లో ఏముంది.. ?
ఇటీవల ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక సాక్షి హత్య సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. సాహిల్ అనే 20 ఏళ్ల వ్యక్తి అత్యంత క్రూరంగా సాక్షిని కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన నేపథ్యంలోనే యశ్ దయాల్ తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. హిందూ యువతులను ప్రేమ పేరుతో మోసం చేసి చంపినట్లు ఈ పోస్ట్ సారాంశం.
యువతి కళ్లకు గంతలు కట్టుకుని ఉండగా ఓ వ్యక్తి తన వీపు వెనుక కత్తిని దాచి పెట్టుకుని ఆమెకు లవ్ ప్రపొజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ పక్కనే పలువురి యువతుల సమాధులు, వాటి మధ్యలో రక్తపుమడుగుల్లో ఉన్న సాక్షి మృతదేహం ఉన్నట్లుగా పోస్ట్‌లో కనిపించింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ పోస్ట్ ఉండడంతో కొద్దిసేపటికే తన తప్పును గ్రహించిన యశ్ దయాల్ ఆ పోస్ట్‌ను డిలీట్ చేశాడు.
అయితే అప్పటికే పలువరు దానిని స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేయడంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో యశ్ దయాల్ క్షమాపణలు కోరాడు. తన తప్పును మన్నించాలని మరో పోస్ట్‌ను చేశాడు. ‘పొరబాటున ఆ కథనాన్ని పోస్ట్ చేశాను దయచేసి క్షమించండి ద్వేషాన్ని వ్యాప్తి చేయొద్దు. ‘థ్యాంక్యూ.. సొసైటీలోని ప్రతి సంఘం, కమ్యూనిటీ పట్ల నాకు గౌరవం ఉంది.’ అంటూ రాసుకొచ్చాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో గుజరాత్ తరఫున యశ్ దయాల్ బరిలోకి దిగాడు. ఓ మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపుకు చివరి ఓవర్‌లో 29 పరుగులు కావాల్సి ఉండగా..యశ్ దయాల్ సమర్పించకున్నాడు. కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ యశ్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించేశాడు. ఆ తర్వాత గుజరాత్ అతడిని జట్టులోకి తీసుకునేందుకు సాహసించలేదు.
King Yash Dayal 👑 pic.twitter.com/zVrH2nlxDt
— izna / इज्ना (@iz_naaah) June 5, 2023