బీసీసీఐ కాసుల వేట.. టైటిల్ స్పాన్సర్గా ఐడీఎఫ్సీ బ్యాంక్
X
టీమిండియా కొత్త టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ఐడీఎఫ్సీ బ్యాంక్ దక్కించుకుంది. ఇకనుంచి టీమిండియా ఆడే ప్రతీ అంతర్జాతీయ మ్యాచులతోపాటు డొమిస్టిక్ స్థాయిలో జరిగే సిరీస్ టైటిల్లకు స్పాన్సర్ గా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ లిమిటెడ్ వ్యవహరించనుంది. శుక్రవారం జరిగిన సమావేశం ద్వారా ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. బీసీసీఐ నిర్వహించే ఇరానీ, దులీప్, రంజీ ట్రోఫీలతోపాటు భారత పురుష, మహిళా జట్లు ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లకు ఈ స్పాన్సర్షిప్ వర్తిస్తుంది.
భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ నుంచి ఈ ఒప్పందం ప్రారంభం అవుతుంది. ఐడీఎఫ్సీ బ్యాంక్ కు స్పాన్సర్షిప్ దక్కిన సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా ఆనందం వ్యక్తం చేశారు. బీసీసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ భాగస్వామ్యంతో భారత క్రికెట్ మరింత విజయవంతం, అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.