Home > క్రికెట్ > WTC Final: తొలిరోజే భారత్ బౌలర్లకు చుక్కలు చూపించారు

WTC Final: తొలిరోజే భారత్ బౌలర్లకు చుక్కలు చూపించారు

WTC Final: తొలిరోజే భారత్ బౌలర్లకు చుక్కలు చూపించారు
X

ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ను టీమిండియా తొలి రోజు చాలా పేలవంగా ప్రారంభించింది. ఇంగ్లాండ్​లోని ఓవల్​ వేదికగా జరుగుతున్న ఈ మెగా మ్యాచ్‌లో రోహిత్ సేన తేలిపోయింది. ట్రావిస్ హెడ్(156 బంతుల్లో 22 ఫోర్లు, సిక్స్‌తో 146 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్(227 బంతుల్లో 14 ఫోర్లతో 95 బ్యాటింగ్) చెలరేగడంతో ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 327 పరుగులు చేసి మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఆసీస్ బ్యాటర్ల ధాటికి భారత బౌలర్లు తేలిపోయారు. ఏం చేయలేని నిస్సహాయతలో కనిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం చేతులెత్తేసాడు.



ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ శుభారంభం అందించాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన లబుషేన్‌తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో కాస్త తడబడిన ఈ జోడీ.. ఉమేశ్ యాదవ్ పేలవ బౌలింగ్‌తో క్రీజులో సెట్ అయ్యింది. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న డేవిడ్ వార్నర్(43)ను శార్దూల్ ఠాకూర్‌ ఔట్ చేయడంతో ఆసీస్ 73/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్ ఆరంభంలోనే లబుషేన్(26)ను మహమ్మద్ షమీ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ట్రావిస్ హెడ్.. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. దూకుడుగా ఆడుతూ 156 బంతుల్లో హెడ్ (146* ) సెంచరీ దాటాడు. స్టీవ్‌ స్మిత్ (95*) సెంచరీకి చేరువయ్యాడు.



ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం టీమిండియా కొంపముంచింది. పిచ్‌ను గ్రీన్ ట్రాక్‌గా సిద్దం చేయడం.. మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో బౌలింగ్‌కు అనుకూలిస్తుందని భావించిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. మరో తప్పు ఏంటంటే.. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కాదని ఉమేశ్ యాదవ్‌తో బరిలోకి దిగింది. కానీ రెండో సెషన్ తర్వాత అశ్విన్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. పేసర్లంతా విఫలమవడం.. జడేజా ప్రభావం చూపకపోవడంతో ఆసీస్ బ్యాటర్లు స్వేచ్చగా ఆడారు.





Updated : 8 Jun 2023 7:27 AM IST
Tags:    
Next Story
Share it
Top