Home > క్రికెట్ > ఆసియా కప్‎కు భారత్ జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు

ఆసియా కప్‎కు భారత్ జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు

ఆసియా కప్‎కు భారత్ జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు
X

ఆసియా కప్‎కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 17 మంది ఆటగాళ్లతో పాటు సంజూ శాంసన్ రూపంలో ఒక స్టాండ్ బై ప్లేయర్‎ను ఎంపికచేసింది. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, అయ్యర్ జట్టులోకి వచ్చారు. ఐపీఎల్‎తో పాటు ఇటీవల వెస్టిండీస్ టూర్‎లో రాణించినా తిలక్ వర్మకు ఆసియాకప్‎లో ఆడే అవకాశం దక్కింది. అయితే భారత్ టీమ్‎పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆసియా కప్‎కు ఎంపికైన టీమిండియాలో సగం మంది ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకే అవకాశం కల్పించారని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబై‌కి చెందిన చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ తమ రాష్ట్రానికే చెందిన ఆటగాళ్లను మాత్రమే జట్టులోకి తీసుకున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.





17 మంది ఆటగాళ్లలో 8 మంది ముంబై జట్టు ఆటగాళ్లు ఉన్నారని..ఇది ఇండియా జట్టులా లేదని మినీ ముంబై లా ఉందని ఎద్దేవ చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు , ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ , జస్‌ప్రీత్ బుమ్రా వంటి ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఉండగా, హార్దిక్ పాండ్యా కూడా గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకే ఆడాడని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ గతంలో రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడారని సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చకు తెరలేపారు.





సంజూశాంసన్‎ను స్టాండ్ బై ప్లేయర్‎గా ఎంపిక చేయడం కూడా విమర్శలకు తావిస్తోంది. సంజూ కంటే సూర్యకుమార్ వన్డే రికార్డు పేలవంగా ఉందని కానీ..అతడినే ఎంపిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పిన్నర్ చాహల్‎ను పక్కనబెట్టడాన్ని పలవురు తప్పుబడుతున్నారు. ఫామ్‎లో లేని కేఎల్ రాహుల్ ఎంపిక కూడా సరైనది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






Updated : 21 Aug 2023 2:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top